News February 13, 2025

HYD: పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలి

image

తరచుగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోందని ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ డా.గోపాలకృష్ణ అన్నారు. బాచుపల్లిలో ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. తమ అభిరుచులను పిల్లలమీద రుద్దకుండా వారికి ఇష్టమైన సబ్జెక్టు ఎంచుకునే అవకాశం ఇవ్వడంతో పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని చెప్పారు.

Similar News

News February 13, 2025

జగిత్యాల: మాటలకే పరిమితం కావొద్దు: MLC జీవన్ రెడ్డి

image

రాజకీయ పార్టీ నాయకులు మాటలకు పరిమితంగా కాకూడదని, చేతల్లో నిరూపించాలని కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలోని ఇందిరా భవన్‌లో ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌తో కలిసి గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ మత విద్వేషాలను రెచ్చగొట్టే పని చేయకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వచ్చేలా సహకరించాలని కోరారు. రిజర్వేషన్లను మతంతో ముడిపెట్టడం సరికాదన్నారు.

2028కల్లా గగన్‌యాన్ మానవసహిత ప్రయోగం

image

గగన్‌యాన్ మానవసహిత ప్రయోగాన్ని 2028కల్లా చేపట్టనున్నట్లు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ‘గగన్‌యాన్‌లో మొత్తం 8 మిషన్స్ ఉంటాయి. వాటిలో 6 మానవరహితంగా, 2 మానవ సహితంగా ఉంటాయి. తొలి ప్రయోగాన్ని ఈ ఏడాది చేపడతాం. గగన్‌యాన్‌కు రూ.20,193 కోట్లను కేటాయించాం’ అని వివరించారు.

error: Content is protected !!