News February 24, 2025
HYD: పిల్లలపై పెరుగుతున్న అఘాయిత్యాలు..!

గ్రేటర్ HYD పరిధిలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. POCSO చట్టం కింద నమోదైన కేసుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. 2022- 426, 2023- 559, 2024- 713 కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుదలపై పోలీసులు, సామాజిక సంస్థలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని, సమాజంలో జరుగుతున్న క్రైమ్స్ గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.
Similar News
News February 24, 2025
రూ.18 లక్షల నగదు పట్టివేత: నిర్మల్ ఏఎస్పీ

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రూ.18 లక్షల నగదును పట్టుకున్నట్లు నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా వెల్లడించారు. సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద సోమవారం పోలీసులు తనిఖీలు నిర్వహించగా సరైనా ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.18 లక్షల నగదును పట్టుకొని సీజ్ చేశామన్నారు. అనంతరం సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు.
News February 24, 2025
జగిత్యాల: 48 గంటల పాటు మద్యం షాపులు బంద్

జగిత్యాల జిల్లాలో 48 మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని మద్యంషాపులు, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు 25-02-2025 సాయంత్రం 4 గంటల నుంచి 27-02-2025 సాయంత్రం 4 గంటల వరకు మూసివేయాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News February 24, 2025
భువనగిరి: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లిలో ఆదివారం జరిగింది. గ్రామస్థుల వివరాలిలా.. వీరారెడ్డిపల్లికి చెందిన మంద చంద్రయ్య అప్పుల బాధతో మనోవేదనకు గురై పంట పొలానికి తెచ్చిన పురుగు మందును తాగాడు. కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందాడు.