News September 2, 2024
HYD: పిల్లల పట్ల జాగ్రత్త: కలెక్టర్
HYD నగర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో HYD సెప్టెంబర్ 2వ తేదీని జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ప్రైవేటు, ప్రభుత్వ, ఏయిడెడ్ పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వర్షం విజృంభిస్తున్న వేళ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లొద్దని, వాతావరణం మార్పులపై పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.
Similar News
News September 14, 2024
HYDలో చదివి.. సుప్రీంకోర్టు ASGగా నియామకం!
రామంతపూర్ HYD పబ్లిక్ స్కూల్లో చదివిన 1987 బ్యాచ్ ఎస్.ద్వారకనాథ్ సుప్రీం కోర్టు అడిషనల్ సోలిసిటర్ జనరల్ (ASG)గా నియమితులయ్యారు. HYDలో చదివి సీనియర్ న్యాయమూర్తి స్థాయి నుంచి ASG స్థాయికి వెళ్లడం తమకు ఎంతో గర్వంగా ఉందని HPS బృందం, ద్వారకానాథ్ తెలియజేశారు. HYD పబ్లిక్ స్కూల్లో చదివిన అనేక మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ముఖ్య పదవుల్లో ఉన్న సంగతి తెలిసిందే.
News September 13, 2024
ప్రజా పాలన దినోత్సవ నిర్వహణ కోసం విస్తృత ఏర్పాట్లు చేయండి: సీఎస్
ఈనెల 17న HYD పబ్లిక్ గార్డెన్‌లో ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ప్రజా పాలన దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లపై గురువారం సచివాలయంలో అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, సిటీ సీపీ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
News September 13, 2024
HYD: డీజీపీ ఎమర్జెన్సీ రివ్యూ.. శాంతిభద్రతలపై టెలి కాన్ఫరెన్స్
ఇటీవలి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో డీజీపీ జితేందర్ ఐపీఎస్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ట్రై కమిషనరేట్‌లలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉద్ఘాటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలన్నారు.