News February 15, 2025

HYD: పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం

image

గచ్చిబౌలిలోని ప్రీజం పబ్‌లో ప్రభాకర్ పోలీసులపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు ప్రభాకర్‌ను విచారణ నిమిత్తం 3 రోజులు కస్టడీకి తీసుకోగా.. శుక్రవారం ముగిసింది. ఆయనను CCS, గచ్చిబౌలి పోలీసులు వివిధ కోణాల్లో విచారించి వివరాలను సేకరించారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80కి పైగా కేసుల్లో నిందితుడైన ఇతడిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం ఉంది.

Similar News

News December 5, 2025

సిద్దిపేట: రెండవ రోజు 295 నామినేషన్లు దాఖలు

image

సిద్దిపేట జిల్లాలో మూడవ విడత తొమ్మిది మండలాల పరిధిలోని 163 గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు 295 నామినేషన్లు దాఖలు కాగా, ఇప్పటి వరకు మొత్తంగా 468 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. అటు 1432 వార్డులకు గానూ రెండవ రోజు 1111 నామినేషన్లు దాఖలు కాగా, మొత్తం 1472 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు. రేపు నామినేషన్లకు చివరి రోజు

News December 5, 2025

విజయనగరంలో డిగ్రీ విద్యార్థి సూసైడ్

image

విజయనగరంలోని స్థానిక ప్రభుత్వ బీసీ వసతి గృహంలో ఓ విద్యార్థిని గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మహారాజా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న స్వాతిగా పోలీసులు గుర్తించారు. ఈమె స్వస్థలం శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంగా తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

News December 5, 2025

డిసెంబర్, జనవరి పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

image

శ్రీవారి ఆలయంలో డిసెంబర్ నుంచి జనవరి వరకు జరిగే పలు పర్వదినాలు, ప్రత్యేక కైంకర్యాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను నిర్ణీత రోజుల్లో టీటీడీ రద్దు చేసినట్లు ప్రకటించింది. 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 29న వైకుంఠ ఏకాదశి ముందు రోజు నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి. ఈ తేదీలకు ముందురోజు వీఐపీ దర్శన సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది.