News April 9, 2025
HYD: పుణ్యక్షేత్రాల గురుకృప టూర్ ఇలా..!

వేసవి వేళ పుణ్యక్షేత్రాల దర్శనం కోసం SCR గురుకృప టూర్ కోసం రైల్వే సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ గురుకృప టూర్ ఈ సారి విజయవాడ నుంచి ప్రారంభమై గుంటూరు → నల్లగొండ → సికింద్రాబాద్ → కాజీపేట → పెద్దపల్లి → మంచిర్యాల → సిర్పూర్ కాగజ్నగర్ → బల్లార్షా → వార్దా → నాగ్పూర్ ప్రాంతాల మీదుగా జరగనున్నట్లు వెల్లడించారు.
Similar News
News December 4, 2025
వచ్చే నెలలో ‘భూభారతి’.. మూడు విడతల్లో ‘భూధార్’: మంత్రి పొంగులేటి

TG: జనవరిలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ అందుబాటులోకి తెస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తున్నామని, ఈ మూడింటి కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ రూపొందిస్తున్నామన్నారు. కొత్త సర్వే నంబర్లు, బౌండరీలు ఫిక్స్ చేసి భూధార్ కార్డులను సిద్ధం చేస్తామని చెప్పారు. మూడు విడతల్లో వీటిని అందిస్తామని పేర్కొన్నారు.
News December 4, 2025
కడప: ప్రైవేట్ ఆస్పత్రుల అనుమతులపై ఆరా.!

కడప జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల అనుమతులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రొద్దుటూరులో ప్రభుత్వ యాజమాన్యంలో జిల్లా ఆస్పత్రి, 6 అర్బన్ హెల్త్ సెంటర్లు, యునాని, హోమియో, ఆయుర్వేదం ఆస్పత్రులు ఉన్నాయి. ప్రైవేట్ యాజమాన్యంలో 108 అల్లోపతి, 30 డెంటల్, 10 పిజియో థెరపీ, 8 హోమియో, 4 ఆయుర్వేదం ఆసుపత్రులు ఉన్నాయి. 38 డయాగ్నస్టిక్ స్కానింగ్ కేంద్రాలు, 13 ల్యాబ్లు ఉన్నాయి.
News December 4, 2025
కోసిన మిరప పంటను ఇలా ఎండబెడితే మేలు

పంట నుంచి కోసిన మిరపకాయలను కుప్పగా పోసి టార్పాలిన్తో ఒక రోజంతా కప్పి ఉంచాలి. ఇలా చేస్తే కాయలు అన్నీ ఒకేలా పండుతాయి. తర్వాత కాయలను పాలిథీన్ పట్టాలపై లేదా శుభ్రం చేసిన కాంక్రీటు కల్లాల మీద ఆరబెట్టాలి. ఇసుక లేదా పేడ అలికిన కల్లాలపై ఆరబెట్టకూడదు. రాత్రిపూట కాయలను పట్టాలతో కప్పి ఉదయం ఎండరాగానే పట్టా తీసేయాలి. మిరపలో తేమ 10-11% వరకు వచ్చేలా ఎండబెట్టాలి. లేకపోతే రంగును, మెరుపును కోల్పోయే అవకాశం ఉంది.


