News December 6, 2024
HYD: పుష్ప-2.. భార్యగా, తల్లిగా రేవతి GREAT
పుష్ప-2 ప్రీమియర్‌షోకు వెళ్లిన రేవతి కుటుంబంలో <<14796361>>విషాదం<<>> మిగిలిన విషయం తెలిసిందే. తనకు 2023లో కాలేయం ఇచ్చి పునర్జన్మనిచ్చిన భార్య లేదనే బాధ కలచివేస్తుందని ఆమె భర్త భాస్కర్ కంటతడిపెట్టిన ఘటన పలువురిని కదిపేసింది. కుమారుడు బన్నీకి వీరాభిమాని అని, ఫస్ట్ షో చూపించమని మారాం చేయడంతో సంధ్య థియేటర్‌కు వెళ్లామని వాపోయారు. క్రౌడ్‌లో కింద పడిపోయిన బాలుడిని పైకిలేపే క్రమంలో తల్లి తీవ్రంగా గాయపడిందని వాపోయారు.
Similar News
News January 14, 2025
HYD: నేడే ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
AICC నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొననున్నారు. రేపు, ఎల్లుండి ఢిల్లీలోనే సీఎం, మంత్రులు బస చేయనున్నారు. ఢిల్లీ నుంచే వారం రోజుల పాటు సింగపూర్, దావోస్ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులతో పర్యటించనున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా వెళ్లనున్నారు.
News January 14, 2025
HYDలో గణనీయంగా తగ్గిన విద్యుత్ వాడకం
సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులు పల్లెటూర్లకు తరలివెళ్లారు. దీంతో గృహాలతో పాటు కార్యాలయాల్లో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పడిపోయింది. ఉత్పత్తులు, రోజువారి కార్యకలాపాలు నిలిచిపోవడంతో వినియోగం గణనీయంగా తగ్గింది. సోమవారం 2,500 మెగావాట్లకు పడిపోయింది. సాధారణ రోజులతో పోలిస్తే 700 మెగావాట్ల విద్యుత్ వినియోగం తగ్గిందని అధికారలు తెలిపారు.
News January 14, 2025
HYD: అర్ధరాత్రి అరెస్టులు చేయడం దారుణం: హరీశ్
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోకాపేటలోని తన నివాసంలో మాట్లాడుతూ.. బెయిలబుల్ సెక్షన్స్‌లో అర్ధరాత్రి అరెస్టులు చేయడం దారుణం అన్నారు. పండగపూట డెకాయిట్‌ని, టెర్రరిస్ట్‌ని అరెస్టు చేసినట్లు పెద్ద సంఖ్యలో పోలీసులు వెళ్లి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.