News July 7, 2024
HYD: పూర్తిగా డిజిటలైజేషన్ దిశగా GHMC

గ్రేటర్ HYD నగరంలో వివిధ పన్నులకు సంబంధించి పూర్తి డిజిటలైజేషన్ దిశగా GHMC అడుగులు వేస్తోంది. గ్రేటర్ పరిధిలో ఆస్తిపన్ను చెల్లింపునకు నగదును స్వీకరించమని గతంలోనే కమిషనర్ తెలిపిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ నిబంధన అమల్లోకి వచ్చాయి. యూపీఐ, క్యూఆర్ కోడ్, క్రెడిట్ ఇతర మార్గాల్లో డిజిటల్ చెల్లింపులు చేయాల్సి ఉంది. దీని ద్వారా అక్రమ వసూళ్లకు తెరపడనుంది.
Similar News
News February 24, 2026
HYD: మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ ఇక చరిత్రే!

రాజేంద్రనగర్ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ ఇక చరిత్రే. 2012 నిబంధనల ప్రకారం 50 మీటర్ల బఫర్ జోన్‌లో ఉండటంతో గతంలో అనుమతులున్నా మార్కెట్ రేటు చెల్లించి స్వాధీనం చేసుకుంటామని RDO వెంకటరెడ్డి కుండబద్దలు కొట్టారు. కిస్మత్‌పురా, దర్గా, ఉప్పర్‌పల్లిలో ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. 60 రోజుల్లో అభిప్రాయాలు తీసుకొని పారదర్శకంగా ముందుకెళ్తామన్నారు. ఇక 500 మీటర్ల పరిధిలో ఇటుక పెట్టే ఛాన్సే లేదు.
News February 24, 2026
HYD: పర్యావరణం పేరుతో పాతాళానికి చెత్త!

జవహర్‌నగర్, దుండిగల్‌లో గుట్టుచప్పుడు కాకుండా 25 శాతం మిగులు వ్యర్థాలను అటవీ ప్రాంతాలకు తరలించేందుకు తెరవెనక పావులు కదులుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. వేస్ట్-టు-ఎనర్జీ తర్వాత మిగిలే ప్రమాదకర బూడిదను ఎకో-పార్కుల ముసుగులో భూమిలో పాతిపెట్టేందుకు క్లియరెన్సుల వేట సాగుతోంది. పర్యావరణ అనుమతులు రావడం కష్టమే అయినా, పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు.
News February 24, 2026
మహిళా శక్తికి 20 ఏళ్లు.. భాగ్యనగరంలో YFLO జోష్!

‘ఆడవాళ్లు తలచుకుంటే ఆకాశమే హద్దు’ఇది మాటలు కాదు, 20ఏళ్ల నిలువెత్తు సాక్ష్యం. యువ మహిళా పారిశ్రామికవేత్తల వేదిక(YFLO) తన 20వ వార్షికోత్సవాన్ని బంజారాహిల్స్‌లో అట్టహాసంగా నిర్వహించింది. ఛైర్‌పర్సన్ పల్లవి జైన్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలో స్వాతిలక్రా, మహిమాదాట్ల, స్వప్నాదత్ పాల్గొన్నారు. నాయకత్వం అంటే అధికారం కాదు, బాధ్యతని చెబుతూ.. గత ఛైర్‌పర్సన్లను సన్మానించి మహిళా సాధికారతే లక్ష్యమని చెబుతున్నారు.


