News December 24, 2024
HYD: పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లి వస్తూ చనిపోయింది!

రాయదుర్గం PS పరిధిలో <<14956935>>శివాని అనే యువతి<<>> రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. CBITలో బీటెక్ 4వ ఏడాది చదువుతున్న శివాని నిజాంసాగర్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లి వచ్చింది. హాస్టల్కు వెళ్లేందుకు స్నేహితుడు వెంకట్ రెడ్డి బైక్ పై ఎక్కి నార్సింగి సర్వీస్ రోడ్డులో వెళ్తుండగా కారు ఢీకొట్టింది. దీంతో శివాని మృతిచెందగా వెంకట్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
Similar News
News November 12, 2025
HYD: రెండేళ్లలో 400 క్యాన్సర్ రోబోటిక్ సర్జరీలు..!

HYD MNJ క్యాన్సర్ ఆస్పత్రి మరో ఘనత సాధించింది. క్యాన్సర్ ఆసుపత్రిలో గత రెండు సంవత్సరాల్లో ఏకంగా 400కు పైగా రోబోటిక్ సర్జరీలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. రోబోటిక్ సర్జరీల ద్వారా అతి సులువుగా, రోగికి ఇబ్బంది లేకుండా శస్త్రచికిత్సలు చేస్తున్నట్లుగా వైద్య బృందం వెల్లడించింది. MNJ ఆసుపత్రి క్యాన్సర్ రోగులకు వరంగా మారుతోంది.
News November 12, 2025
HYD: రోడ్లపై రేగే దుమ్ము వల్లే 32% పొల్యూషన్..!

HYD నగరంలో సూక్ష్మ ధూళికణాల కారణంగా జరుగుతున్న కాలుష్యంపై ఐఐటీ కాన్పూర్ ప్రత్యేకంగా స్టడీ చేసింది. అయితే రోడ్లపై రేగే దుమ్ము కారణంగానే 32% పొల్యూషన్ జరుగుతుందని, వాహనాల ద్వారా 18%, ఆర్గానిక్ పదార్థాల వల్ల 16%, బర్నింగ్ బయోమాస్ వల్ల 11 శాతం జరుగుతున్నట్లు తెలిపింది. పరిశ్రమల వల్ల 5 శాతం పొల్యూషన్ జరుగుతుందని పేర్కొంది.
News November 12, 2025
HYD: 15 ఏళ్లు దాటితే తుక్కుగా మార్చాలి.. RTC సమాలోచన!

కేంద్ర ప్రభుత్వ పాలసీ ద్వారా 15 ఏళ్లు దాటిన ఆర్టీసీ డీజిల్ బస్సులను తుక్కుగా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో HYD రీజియన్ పరిధిలోని ఆర్టీసీ బస్సులపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా అధికారులు తెలియజేశారు. డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడంపై సైతం సమాలోచన చేస్తూ ముందుకు వెళుతున్నట్లు వివరించారు.


