News October 1, 2024

HYD: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

ఏడాదికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతికి మాంసాహారం, మందు షాపులు బంద్ కానున్నాయి. దీంతో HYD,RR,VKB,మేడ్చల్ మల్కాజిగిరి, ప్రజలు పెత్తర అమావాస్య జరుపుకునేది ఎలా అనే ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా.. పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని అంటున్నారట.

Similar News

News October 31, 2025

HYD: ఉక్కు మనిషి వల్లే ఊపిరి పీల్చాం!

image

భారత ఏకత్వానికి ప్రతీకగా నిలిచారు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌. 565 సంస్థానాలను ఒకే త్రివర్ణ పతాకం కింద సమీకరించిన మహనీయుడు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడంలో ఆయన చూపిన ధైర్యం చరిత్రలో చెరిగిపోదు. ఆపరేషన్‌ పోలో ద్వారా నిజాంపాలనకు తెరదించారు. ఉక్కు మనిషి ఉక్కు సంకల్పం వల్లే ఊపిరి పీల్చామనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరేమంటారు?

News October 31, 2025

HYD: ఉక్కుమనిషి ‘సర్దార్’ ఎలా అయ్యారో తెలుసా?

image

1928లో గుజరాత్‌లోని బర్దోలి తాలూకాలో బ్రిటిష్ ప్రభుత్వం భూమిశిస్తు 30% పెంచగా రైతులు ఆగ్రహించారు. ఎన్నో విన్నపాలు చేసినా ప్రభుత్వం స్పందించలేదు. పటేల్ స్ఫూర్తితో వారంతా సత్యాగ్రహానికి దిగారు. 137 గ్రామాల రైతులు ఐక్యంగా పోరాడారు. ఒత్తిడికి తలొగ్గిన బ్రిటిష్ ప్రభుత్వం శిస్తు తగ్గించక తప్పలేదు. రైతుల ఐక్యతకు శిఖరంగా నిలిచిన ఈ పోరాటం పటేల్‌ను ‘సర్దార్’ చేసింది. ఆయన చొరవతోనే HYD భారత్‌లో విలీనం అయింది.

News October 31, 2025

HYD: అజహరుద్దీన్ ప్రస్థానం ఇదే!

image

రాజ్ భవన్‌లో మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. భారత్ క్రికెట్ జట్టు సారథిగా వ్యవహరించిన అజహరుద్దీన్ 1963 ఫిబ్రవరి 8న HYDలో జన్మించారు. అబిడ్స్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో పాఠశాల విద్య, నిజాం కాలేజీలో బీకాం అభ్యసించారు. 2009లో అజహరుద్దీన్ కాంగ్రెస్‌లో చేరి, యూపీలోని మొరాదాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు.