News July 16, 2024

HYD: పెన్షన్ కోసం మహిళ ప్రజావాణిలో ఫిర్యాదు

image

బ తికున్నా, చనిపోయానని పెన్షన్ ఇవ్వడం లేదంటూ ప్రజావాణిలో ఓ వృద్ధురాలి ఆవేదన చెందారు. HYD ఖైరతాబాద్‌ బీజేఆర్‌నగర్‌కు చెందిన కే.రుక్నమ్మ(59)కు భర్త చనిపోయాడు. ఒంటరి మహిళ పెన్షన్ ఇవ్వమని దరఖాస్తు చేసుకుంటే.. తాను చనిపోయినట్టు రికార్డుల్లో ఉందని, బతికున్నట్టు నిరూపించుకోవాలని అధికారులు అన్నారని వాపోయారు. తనకు తిరిగి పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను కోరారు.

Similar News

News October 4, 2024

HYD: ఈ నెల 13న ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్

image

ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వహణ కమిటీ ఛైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లను, కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించినట్లు విజయలక్ష్మి చెప్పారు.

News October 4, 2024

HYD: నేడు హైకోర్టులో వైద్య శిబిరం

image

నిర్మాణ్ సంస్థ, తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా ఈరోజు హైకోర్టులో మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఉస్మానియా సూపరింటెండెంట్ డా.రాకేశ్ సహాయ్ తెలిపారు. ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ముఖ్యఅతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు.

News October 4, 2024

గోవా వెళ్తున్నారా..? సికింద్రాబాద్ నుంచి 2 ట్రైన్లు

image

సికింద్రాబాద్ నుంచి గోవాకు ట్రైన్స్ పెంచాలని ఉన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ క్రమంలో గోవాకు వారానికి రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడవనున్నాయి. ఇవి అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి సికింద్రాబాద్ నుంచి గోవా మధ్య నడుస్తాయి. సికింద్రాబాద్- వాస్కోడగామా రైలు (17039/17040) బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి గురు, శనివారాల్లో వాస్కోడగామా నుంచి నడుస్తుంది.