News September 7, 2024
HYD: పెరగనున్న GHMC.. తగ్గనున్న HMDA

హెచ్ఎండీఏ పరిధిలోని కీలక ప్రాంతాలన్నీ ఇక నుంచి మహా బల్దియా పరిధిలోకి రానున్నాయి. దాదాపు 51 గ్రామాలు జీహెచ్ఎంసీలో కలవనున్నాయి. ప్రస్తుతం హెచ్ఎండీఏ విస్తరిత ప్రాంతం విస్తీర్ణం 7,200 చదరపు కిలోమీటర్లు. దాదాపు 841 గ్రామాలు హెచ్ఎండీఏ కింద ఉన్నాయి. ఆయా ప్రాంతాలన్నీ ఇక నుంచి బల్దియా కిందకు రానున్నాయి. దీంతో హెచ్ఎండీఏ విస్తీర్ణం 5,872 చదరపు కిలోమీటర్లకు పరిమితం కానుంది. SHARE IT
Similar News
News September 19, 2025
సరూర్‌నగర్ చెరువులో దూకి సూసైడ్

సరూర్‌నగర్ చెరువులో గృహిణి పోళ్ల భవాని (28) ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలు, భర్త మద్యపాన అలవాటు కారణంగా విభేదాలు తీవ్రస్థాయికి నెలకొన్నాయి. ఈనెల 16న సైదాబాద్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్ జరిగినా సమస్యలు తగ్గకపోవడంతో గురువారం సాయంత్రం చెరువులోకి దూకేసింది. మృతదేహం కోసం పోలీసులు, హైడ్రా టీమ్, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని సీఐ సైదిరెడ్డి తెలిపారు.
News September 18, 2025
అమీర్‌పేటలో వాల్యూ జోన్ వచ్చేసింది!

నగరంలోని షాపింగ్ ప్రియులకు శుభవార్త. సిటీ నడిబొడ్డున ఉన్న అమీర్‌పేటలో వాల్యూ జోన్ వచ్చేసింది. 75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రారంభించిన అతిపెద్ద షాపింగ్ మాల్ ఇది. ఈ దసరాకు ఇక్కడ ఫ్యాషన్, గ్రాసరీ, హోమ్ వేర్, వస్తు సామగ్రిపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. కుటుంబంలోని అన్ని తరాల వారిని దృష్టిలో పెట్టుకొని అమీర్‌పేటలో బ్రాంచ్ ఓపెన్ చేసినట్లు ఫౌండర్ శ్రీ పొట్టి వెంటటేశ్వర్లు తెలిపారు.
News September 18, 2025
BREAKING: మైసమ్మగూడ చెరువులో తండ్రి, కూతురు మృతి

మేడ్చల్ జిల్లాలోని మైసమ్మగూడ చెరువులో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. గురువారం ఉదయం ఇది గమనించిన స్థానికులు పేట్‌బషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు, హైడ్రా సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. మృతులు బహదూర్‌పల్లిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన అశోక్ (50), కూతురు దివ్య(5)గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.