News March 10, 2025

HYD: పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు

image

HYDతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మార్చి నుంచి జూన్ వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మార్చి మొదటి వారంలో ఎండల తీవ్రత ఒక్కసారిగా 37.4 డిగ్రీలకు చేరింది. రాత్రి ఉష్ణోగ్రత 19.8 డిగ్రీలుగా నమోదు కాగా.. పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News March 24, 2025

GHMCలో 27 మంది ఇంజినీర్ల తొలగింపు

image

GHMC కమిషనర్ ఇలంబర్తి కీలక నిర్ణయం తీసుకున్నారు. GHMC టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న న్యాక్ అవుట్ సోర్సింగ్ 27 మంది ఇంజినీర్లను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. క్రమశిక్షణ, అక్రమాలకు పాల్పడుతున్నవారితో చెడ్డపేరు వస్తుందని, వీరిని విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. కొంతకాలంగా గ్రేటర్లో ఆక్రమణలపై ఇంజినీర్లు తనిఖీలు చేయకపోవడం, చేసినా చర్యలు తీసుకోకపోవడంతో తొలగించినట్లు తెలిపారు.

News March 24, 2025

HYD MMTSలో యువతిపై అత్యాచారయత్నం

image

సికింద్రాబాద్ TO మేడ్చల్ MMTSలో ఓ యువతిపై దుండగుడు అత్యాచారానికి యత్నించాడు. యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై అత్యాచారానికి యత్నించగా.. కదులుతున్న ట్రెయిన్‌లో నుంచి ఆ యువతి దూకేసింది. తీవ్రగాయాలైన ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 23, 2025

ఫిలింనగర్‌: తల్లి డైరెక్షన్‌లో కొడుకుల చోరీ

image

ఫిలింనగర్ PS పరిధిలో ఇటీవల డైమండ్‌హిల్స్ కాలనీలో 32 తులాల బంగారం, రూ.4.5 లక్షల నగదు చోరీ అయింది. లేడీ డాన్ సనా బేగం ఈ చోరీ చేయించి, 10 తులాల బంగారం విక్రయిస్తూ రెండో కొడుకు సొహాయిల్‌తో సహా పట్టుబడింది. మిగిలిన ఇద్దరు కొడుకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సనాపై ఇప్పటివరకు 43 చోరీ కేసులు ఉన్నాయి. తల్లి డైరెక్షన్ ఇస్తే కొడుకులు రంగంలోకి దిగి చోరీలు చేస్తున్నట్లుగా పోలీసులు దర్యాప్తులో తేల్చారు.

error: Content is protected !!