News March 20, 2024

HYD: పెరుగుతున్న విద్యుత్ వినియోగం..!

image

వేసవికాలం వేళ HYDలో విద్యుత్ వినియోగం పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం మార్చి నెలలో 5న సరాసరిగా 52.15 మిలియన్ యూనిట్లు నమోదైంది. ఈ ఏడాది మార్చి మొదటి వారంలోనే ఒక రోజుకు 70.71 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు తెలిపారు. ఏప్రిల్, మే నెలలో మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తగు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యుత్‌ అధికారులు పేర్కొన్నారు.

Similar News

News November 20, 2025

వజ్రోత్సవం వేళ.. JNTUపై వరాలు కురిపించేనా?

image

జేఎన్టీయూ వజ్రోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించేంచనున్నారు. 21న వజ్రోత్సవం, 22న పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగనుంది. మొదటి రోజు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సీఎం కళాశాలకు ఏమైనా వరాలు ప్రకటిస్తారా? అని అధ్యాపకులు, విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సీఎం రాకతో సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News November 20, 2025

బంజారాహిల్స్ రోడ్డు విస్తరణపై హైకోర్టు ఆదేశం

image

బంజారాహిల్స్ విరించి ఆస్పత్రి నుంచి అగ్రసేన్ జంక్షన్ వరకు రోడ్డు విస్తరణకు జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు మద్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. భూసేకరణ చట్టం నిబంధనలను పాటించకుండా జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ విక్రమ్ దేవ్‌తో సహా 20 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

News November 20, 2025

మాజీ సైనికులకు గుడ్ న్యూస్.. 28న జాబ్ మేళా

image

సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన మాజీ సైనికోద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ నెల 28వ తేదీన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు ఈ మేళా ఉంటుందన్నారు. వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారి హరినాయక్ తెలిపారు. ఆసక్తిగల వారు www.dgrindia.gov.inలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.