News April 14, 2025

HYD: పెళ్లి అయిన 3 రోజులకే హత్య (UPDATE)

image

రెయిన్‌బజార్ PS పరిధిలో జరిగిన రౌడీషీటర్ మసీయుద్దీన్‌ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను గుర్తించేందుకు హత్య జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ హత్య ఘటనతో ఫలక్‌నుమా ఉలిక్కిపడింది. మసీయుద్దీన్‌కు <<16091246>>3 రోజుల క్రితమే వివాహం<<>> జరిగినట్లు తెలుస్తోంది. నూతన జీవితంలో అడుగుపెట్టిన అతడు హత్యకు గురవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Similar News

News October 25, 2025

వనపర్తిలో భారీ వర్షాలు.. విలియంకొండలో 101.8 మి.మీ.

image

వనపర్తి జిల్లాలో గత 24 గంటల్లో (శుక్రవారం ఉదయం 8:30AM నుంచి శనివారం ఉదయం 8:30AM) భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా విలియంకొండలో 101.8 మి.మీ. వర్షం కురిసింది. ఏదుల 69.5 మి.మీ., పెద్దమందడి 57.5 మి.మీ., గోపాల్‌పేట 54.3 మి.మీ., మదనాపురంలో 52.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి.

News October 25, 2025

అంతర పంటలతో వ్యవసాయంలో అధిక లాభం

image

ప్రధాన పంట వరుసల మధ్య ఉన్న ఖాళీ స్థలం వృథా కాకుండా పండించే మరో పంటను అంతర పంట అంటారు. ఈ విధానంలో ఒక పంట దెబ్బతిన్నా.. మరొకటి చేతికొస్తుంది. వాతావరణం అనుకూలిస్తే 2 పంటల నుంచి రైతు మంచి ఆదాయం పొందవచ్చు. దీని వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. కీటకాలు, తెగుళ్లు, కలుపు మొక్కల బెడద, నేలకోత తగ్గి.. భూమిలో పోషకాలు పెరిగే అవకాశం ఉంది. అంతర పంటల సాగు వల్ల వచ్చిన ఆదాయం ప్రధాన పంట పెట్టుబడికి సహాయపడుతుంది.

News October 25, 2025

జన్నారం: కూతురితో తల్లి సూసైడ్.. కారణం ఇదే..!

image

జన్నారం మందపల్లిలో <<18091156>>కూతురితో తల్లి<<>> ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఎస్సై అనూష ప్రకారం.. మందపల్లి వాసి శ్రావణ్ జగిత్యాల జిల్లా వాసి స్పందనను పెళ్లి చేసుకున్నాడు. వారికి 3ఏళ్ల మోక్షశ్రీ, 11 నెలల వేదశ్రీ ఉన్నారు. 6 నెలలుగా స్పందన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంటానని అనడంతో కుటుంబీకులు జాగ్రత్తగా కనిపెడుతున్నారు. శుక్రవారం 11 నెలల వేదశ్రీతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.