News July 8, 2024

HYD: పెళ్లి కావడం లేదని చనిపోయాడు..!

image

పెళ్లి కావడం లేదని ఓ యువకుడు చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారానికి చెందిన సి.బాబు(27), ఆయన అన్న రాజు HYD మియాపూర్‌లోని మెట్రో రైలు డిపోలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఇటీవల బాబు స్వగ్రామానికి వెళ్లి రాత్రి ఉరేసుకున్నాడు. పెళ్లి కావడం లేదని మనస్తాపంతో తన కొడుకు చనిపోయాడని అతడి తల్లి సరోజన PSలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News November 9, 2025

జూబ్లీహిల్స్‌లో: ఈరోజు నుంచి బస్తీ నాయకులదే హవా!

image

ప్రచారం కొద్ది గంటల్లో ముగియనుంది. నియోజకవర్గానికి నాయకులెవరూ వెళ్లరు. ఈ పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రం నుంచి ఎన్నికలు ముగిసే వరకు స్థానిక నాయకులు, బస్తీ లీడర్లు కీలకపాత్ర వహించనున్నారు. ప్రధాన పార్టీల నాయకులు కూడా వీరిని కలిసి ఎవరికి ఏమేమి కావాలో తెలుసుకొని వారికి అవసరమైన డబ్బు, బహుమానాలు ఇచ్చే అవకాశముంది. అయితే నేరుగా వారికి ఇవ్వకపోయినా ఇతర నియోజకవర్గం బయట అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

News November 9, 2025

జూబ్లీ బైపోల్: వీరికి టెన్షన్.. వారికి ప్రశాంతం

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక సందర్భంగా కొద్ది రోజులుగా ప్రచారం జోరుగా సాగింది. మైకుల హోరుతో వీధులు, బస్తీలు దద్దరిల్లాయి. ఇక ఈ రోజు సాయంత్రం నుంచి ప్రచారం ముగియనుండటంతో ఈ గోల ఉండదు. దీంతో నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా.. రణగొణ ధ్వనులు లేకుండా ఉంటారు. అయితే పోటీచేసే అభ్యర్థులు, పార్టీల నాయకులు మాత్రం టెన్షన్‌తో ఉంటారు. ఎవరు.. ఎవరికి ఓటేస్తారో అర్థంకాక తలలు పట్టుకుంటారు.

News November 9, 2025

జూబ్లీ బైపోల్: అసలు అభ్యర్థులేమైనా మాట్లాడారా?

image

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో 3 ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులతో రోడ్‌షోలు నిర్వహించాయి. అంతటితో ఆగకుండా పార్టీ పెద్దలు వారి విజయం కోసం ప్రచారం చేశారు. అసలు విషయం ఏంటంటే ఈ పార్టీల అభ్యర్థులు ఓటర్లకేమైనా హామీలిచ్చారా? అసలు వీరిని బడా నాయకులు మాట్లాడనిచ్చారా? అని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతా మీరే చేస్తే.. ఇక అభ్యర్థులెందుకు.. మీరే పోటీచేయొచ్చు కదా అని విమర్శిస్తున్నారు.