News July 8, 2024

HYD: పెళ్లి కావడం లేదని చనిపోయాడు..!

image

పెళ్లి కావడం లేదని ఓ యువకుడు చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారానికి చెందిన సి.బాబు(27), ఆయన అన్న రాజు HYD మియాపూర్‌లోని మెట్రో రైలు డిపోలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఇటీవల బాబు స్వగ్రామానికి వెళ్లి రాత్రి ఉరేసుకున్నాడు. పెళ్లి కావడం లేదని మనస్తాపంతో తన కొడుకు చనిపోయాడని అతడి తల్లి సరోజన PSలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News December 14, 2025

RR: 81.76% పోలింగ్ నమోదు.. కౌటింగ్ షురూ

image

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం పోలింగ్ ముగిసే వరకు 81.76 % పోలింగ్ నమోదయింది.
➦ ఆమనగల్లు మండలంలో 90.21%
➦ చేవెళ్లలో- 74.6%
➦ కడ్తాల్‌లో- 72.05%
➦ మొయినాబాద్- 84.19%
➦ షాబాద్- 80.77%
➦ శంకర్‌పల్లి- 85.97%
➦ తలకొండపల్లి- 88.38% పోలింగ్ నమోదైంది.

News December 14, 2025

రంగారెడ్డి: మొదలైన పోలింగ్.. ఓటేయండి

image

రంగారెడ్డి జిల్లాలో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. షాబాద్‌ మం.లోని ఎల్గొండగూడలో‌ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 178 జీపీలకు ఎన్నికల జరగనుండగా.. ఇప్పటికే కొన్ని ఏకగ్రీవం అయ్యాయి. మిగతా అన్ని పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది. వెళ్లి ఓటేయండి.

News December 14, 2025

రంగారెడ్డి: 2nd ఫేజ్.. సర్పంచ్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం

image

రంగారెడ్డి జిల్లాలో నేడు రెండవ విడతలో భాగంగా సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. శంకర్‌పల్లి 24, మొయినాబాద్ 19, చేవెళ్ల 25, షాబాద్ 41, ఆమనగల్లు 13, కడ్తాల్ 24, తలకొండపల్లి 32 GPలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన GPలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల తరువాత ఫలితాల కోసం Way2Newsను చూడండి.
SHARE IT