News June 24, 2024
HYD: పెళ్లి చూపులు.. అంతలోనే విషాదం!

పెళ్లి చూపులకు ప్రయాణమైన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. జూబ్లీహిల్స్ PS పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా చిన్నంబావి మం. లక్ష్మీపల్లి వాసి శివశంకర్ నగరంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఆదివారం పెళ్లిచూపులు ఉండడంతో శనివారం రాత్రి బైక్ పై స్వగ్రామానికి బయల్దేరాడు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 వద్ద ఓ టిప్పిర్ ఢీ కొట్టడంతో మృతి చెందాడు.
Similar News
News October 28, 2025
యూసుఫ్‌గూడలో CM మాట.. కార్మికుల్లో కొత్త ఆశలు

కృష్ణానగర్.. సినీ కార్మికుల అడ్డా. యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు నుంచి వెంకటగిరి వరకు ఉ.6 గంటలకే హడావిడి ఉంటుంది. ఈరోజు మాత్రం కొత్తగా ఉంది. సినీ కార్మికుల కోసం CM రావడంతో సందడి కనిపించింది. రేవంత్‌ని చూడాలన్న ఉత్సాహంతో వేలాదిమంది పోలీస్ గ్రౌండ్‌కు క్యూ కట్టారు. CM నోటి నుంచి శుభవార్త కూడా విన్నారు. టికెట్ల పెంపులో 20 శాతం కార్మికులకు ఇవ్వాలని నిర్మాతలకు చెప్పడంతో కార్మికుల ఉత్సాహం రెట్టింపయ్యింది.
News October 28, 2025
HYD: ఆన్లైన్లో ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ సేవలు!

GHMC పౌరులకు సేవలను సులభతరం చేసింది. ఇకపై ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ సేవలు ghmc.gov.in ద్వారా ఇంటి నుంచే లభిస్తాయి. పౌరులు మీసేవ కేంద్రాలు, జీహెచ్ఎంసీ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం తమ PTIN/TIN/VLTN నమోదు చేసి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేస్తే చాలు. దరఖాస్తులకు త్వరితగతిన ఆన్లైన్ ద్వారానే అనుమతులు లభిస్తాయి.
SHARE IT
News October 28, 2025
జూబ్లీ బైపోల్: మంత్రులకు డివిజన్ల బాధ్యతలు

జూబ్లీహిల్స్ బైపోల్లో భాగంగా డివిజన్ల వారీగా మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. రహమత్‌నగర్- కోమటిరెడ్డి, పొంగులేటి, బోరబండ- సీతక్క, మల్లు రవి, వెంగళ్రావునగర్- తుమ్మల, వాకిటి శ్రీహరి, సోమాజిగూడ- శ్రీధర్ బాబు, అడ్లూరి, షేక్‌పేట్- కొండా సురేఖ, వివేక్, ఎర్రగడ్డ- దామోదర, జూపల్లి, యూసుఫ్‌గూడ- ఉత్తమ్, పొన్నం ప్రభాకర్‌కు ప్రచార బాధ్యతలు అప్పగించారు.


