News May 4, 2024

HYD: పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

image

పెళ్లి పేరుతో ఓ యువతిని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన HYD వనస్థలిపురం PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా ఉండే ఓ సంస్థలో యువతితోపాటు యువకుడు పనిచేస్తూ ఆమెతో స్నేహపూర్వకంగా మెలిగాడు. ఆమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పి లోబరుచుకున్నాడు.ఆ సమయంలో కొన్ని ఫొటోలు తీశాడు. పెళ్లి గురించి ఆమె అడగగా నిరాకరించి, ఫొటోలు వైరల్ చేస్తా అని బెదిరించడంతో PSలో ఫిర్యాదు చేసింది.

Similar News

News October 24, 2025

పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ బ్యాక్‌లాగ్ ఫలితాల విడుదల

image

ఓయూ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంకామ్ (ఐఎస్) తదితర కోర్సుల 2000-19 మధ్య బ్యాచ్‌ల విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఫలితాలు సిద్ధంగా ఉన్నాయని, విద్యార్థులు తమ మార్కు మెమోలను ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచిలోని పీజీ సెక్షన్ (రూం నంబర్.13) నుంచి తీసుకోవచ్చని సూచించారు.

News October 24, 2025

HYD: హమ్మయ్య! లాస్ట్ మినెట్‌లో ఫేట్ మారిపోయింది

image

కర్నూల్ బస్సు ప్రమాదం నుంచి సికింద్రాబాద్ చిలకలగూడ బడే మసీదుకు చెందిన తరుణ్ కుమార్ లక్కీగా తప్పించుకున్నారు. నిన్న రాత్రి పారడైజ్ వద్ద బస్సు ఎక్కాల్సి ఉండగా శంషాబాద్‌లో పని ఉందని అక్కడ బస్సు ఎక్కుతానని చెప్పారు. కానీ పని పూర్తి కాకపోవడంతో 40 నిమిషాల తర్వాత వేరే బస్సులో బెంగళూరు వెళ్లిపోయారు. దీపావళి సెలవులకు ఇంటికి వచ్చిన ఆయన నేవీలో లెఫ్టినెంట్ కమాండర్‌గా పనిచేస్తున్నట్లు Way2Newsకు తెలిపారు.

News October 24, 2025

HYD: బస్సు ఘటన: హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

image

బెంగళూరు బస్సు ఘటనలో చిక్కుకున్న ప్రయాణికుల కుటుంబ సభ్యులకు సహాయంగా TG ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్‌లైన్‌ను పర్యవేక్షించేందుకు ప్రోటోకాల్‌ శాఖ డైరెక్టర్‌కి బాధ్యతలు అప్పగిస్తూ అధికారులను నియమించింది.
ఎం.శ్రీ రామచంద్ర, అసిస్టెంట్‌ సెక్రటరీ (ఫోన్‌: 9912919545),
ఇ.చిట్టిబాబు, సెక్షన్‌ ఆఫీసర్‌ (ఫోన్‌: 9440854433).
ఈ హెల్ప్‌లైన్‌ ద్వారా బాధిత కుటుంబాలకు సమాచారం ఇస్తారు.