News May 4, 2024
HYD: పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
పెళ్లి పేరుతో ఓ యువతిని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన HYD వనస్థలిపురం PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా ఉండే ఓ సంస్థలో యువతితోపాటు యువకుడు పనిచేస్తూ ఆమెతో స్నేహపూర్వకంగా మెలిగాడు. ఆమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పి లోబరుచుకున్నాడు.ఆ సమయంలో కొన్ని ఫొటోలు తీశాడు. పెళ్లి గురించి ఆమె అడగగా నిరాకరించి, ఫొటోలు వైరల్ చేస్తా అని బెదిరించడంతో PSలో ఫిర్యాదు చేసింది.
Similar News
News November 12, 2024
HYD: రైల్ సేవల పట్ల ప్రయాణికుల హర్షం
సికింద్రాబాద్ నుంచి జ్యోతిర్లింగ భారత్ గౌరవ్ ట్రైన్ సేవల పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక ప్రాంతాలైన రామేశ్వరం, తిరువన్నామలై, కన్యాకుమారి, మధురై, తిరువనంతపురం లాంటి పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. కుటుంబ సమేతంగా అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించుకునే అవకాశం కల్పించినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
News November 12, 2024
వికారాబాద్‌లో హైటెన్షన్!
వికారాబాద్ జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా ప్రత్యేక అధికారిపై దాడిని వ్యతిరేకిస్తూ ఓ వైపు కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లగచర్లలో పోలీసులు భారీగా మోహరించారు. దాడి వెనుక BRS హస్తం ఉందని HYD వేదికగా కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి. ఈ తరుణంలో గ్రామస్థుల అరెస్ట్‌లకు నిరసనగా BRS నేతలు వికారాబాద్ బయల్దేరారు. ఈ వ్యవహారం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
News November 12, 2024
హైదరాబాద్‌కు భగత్ సింగ్ మేనల్లుడి రాక
స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్ మేనల్లుడు ప్రొ. జగ్మోహన్ సింగ్ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 26న హిమాయత్‌నగర్, 27 న కుత్బుల్లాపూర్‌లో జరిగే సభల్లో ఆయన పాల్గొంటారని AISF, AIYF, CPI ప్రకటించాయి. భగత్‌సింగ్ ఆశయాలను కొనసాగిస్తున్న ప్రొ. జగ్మోహన్ సింగ్ మేధావులు, విద్యార్థులు, యువత, ఉద్యమకారులతో ఇంట్రాక్ట్ అవుతారని తెలిపారు. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని MLA కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు.