News March 8, 2025
HYD: పెళ్లైన నెలరోజులకే నవ వధువు ఆత్మహత్య

పెళ్లైన నెలరోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలానగర్లో జరిగింది. బాల్రెడ్డినగర్లో నివాసం ఉంటున్న విజయగౌరి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఆమె బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. గత నెల 6వ తేదీన ఈశ్వరరావుతో విజయగౌరికి వివాహం జరిగింది. మృతురాలి స్వస్థలం ఏపీలోని విజయనగరం జిల్లా. ఇష్టం లేని పెళ్లి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు.
Similar News
News December 2, 2025
HYDలో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్

హైదరాబాద్లో మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం జరగనుంది. యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం హైదరాబాదులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 23 యూరోపియన్ దేశాలకు చెందిన 23 ఉత్తమ చిత్రాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కానున్నాయి. ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్, శ్రీసారథి స్టూడియోస్, అలయన్స్ ఫ్రాన్సిస్ హైదరాబాద్లో ఈ సినిమాలు ప్రదర్శించనున్నారు. ఈనెల 5వ తేదీ నుంచి 14 వరకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
News December 2, 2025
HYD: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఖాజాగూడా చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో 8 భారీ టవర్స్ అక్రమంగా నిర్మిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్, మురళి నాయక్, రాకేష్ రెడ్డి పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, బిల్డర్లకు నోటీసులిచ్చింది.
News December 2, 2025
HYD: సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి స్లాట్స్

సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి రోజురోజుకు పెరిగిపోతుంది. అవినీతిని అరికట్టేందుకు తెచ్చిన స్లాట్ బుకింగ్ను అక్రమార్కులు తమ దందాకు వాడుకుంటున్నారు. HYD పరిధిలోని 45 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇది సాగుతోంది. లాగిన్ ఐడీలను క్రియేట్ చేసి అవసరం లేకుండా స్లాట్ బుక్ చేస్తున్నారు. అత్యవసరంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి నుంచి ఎక్కువ డబ్బులు లాగుతూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ప్రజలు తెలిపారు.


