News January 15, 2025
HYD: పొలం అనుకుంటే పొరపాటే..!

ఈ ఫోటోలో పచ్చని పైరులా కనిపించేది.. పొలం, నారుమడి అని అనుకుంటే పొరపాటే. HYD పరిధి కొండాపూర్ మజీద్‌బండ చెరువును గుర్రపు డెక్క కప్పేయడంతో ఇలా కనిపిస్తోంది. HYDలో అనేక చెరువుల పరిస్థితి ఇదే విధంగా ఉందని, గ్రేటర్ ప్రజలు జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిర్యాదులు చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోయారు. చెరువుల సుందరీకరణపై శ్రద్ధ ఎక్కడ..? అని ప్రశ్నించారు.
Similar News
News February 18, 2025
శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికలపై సీఐఎస్ఎఫ్ అధికారులకు అనుమానం రాగా అతడిని అదుపులోకి తీసుకొని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో అతని వద్ద నుంచి 22 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించింది. కరెన్సీని స్వాధీనం చేసుకున్న అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
News February 18, 2025
HYD: హడలెత్తిస్తున్న వరుస హత్యలు

మేడ్చల్‌లో వరుస హత్యలు స్థానికులను హడలెత్తిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు హత్యలు జరిగాయి. ఇటీవలే పట్టపగలు మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారిపై గూగులోత్ ఉమేశ్ (23) హత్య జరగ్గా, ఆదివారం రాత్రి వెంకటరమణ అనే వ్యక్తిని మైనర్ బాలుడు అయిన అతని అల్లుడు హత్య చేశాడు. వరుస హత్యలతో పట్టణవాసులు భయాందోళనలకు గురవుతున్నారు.
News February 18, 2025
HYD: కిడ్నీ రాకెట్ కేసు.. లుకౌట్ సర్క్యులర్ జారీ

సరూర్ నగర్‌లోని అలకనంద ఆసుపత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసులో సోమవారం డా.రాజశేఖర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడు పవన్ విదేశాలకు పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. ఆయన ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు తాజాగా లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అయితే HYD నగరంలో దాదాపు 90 వరకు ఆపరేషన్లు జరిగినట్లు దర్యాప్తులో తేలింది.