News November 11, 2024
HYD: పోచమ్మ గుడి వద్ద మహాతాండవం ఆడుతా: అఘోరీ

శంషాబాద్లో ధ్వంసమైన పోచమ్మ గుడి వద్ద తాను మహాతాండవం ఆడబోతున్నట్లు అఘోరి తెలిపారు. గుంటూరు జిల్లాలోని కోటప్ప స్వామి ఆలయం వద్ద ఆమె మాట్లాడుతూ.. స్త్రీ శక్తి బయటకు వస్తే ఎవరూ తట్టుకోలేరన్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యానికి పాల్పడితే మగాళ్ల మర్మాంగాన్ని కోసేస్తానని హెచ్చరించారు. మహిళల కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేయడానికి సిద్ధమని పేర్కొన్నారు.
Similar News
News December 1, 2025
HYD: ఇష్టారీతిగా ప్రైవేట్ స్కూల్ ఫీజులు వసూళ్లు!

నగరంలో ప్రైవేట్ స్కూల్స్ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. తమ జేబులు ఖాళీ చేయడంమే లక్ష్యంగా ప్రైవేట్ స్కూల్స్ ఉంటున్నాయని పేరెంట్స్ వాపోతున్నారు. ట్యూషన్, స్పెషల్ ఫీజులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజులు నియంత్రణ చేపటకపోవడంతో, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు రెచ్చిపోతున్నారు. దీనిపై సహించేది లేక విద్యాశాఖకు ఫిర్యాదు చేయాలని తల్లిదండ్రులు యోచిస్తున్నారు.
News December 1, 2025
HYD: RRRకు సర్వీస్ రోడ్డు లేదు!

సాధారణంగా ఔటర్ రింగ్ రోడ్డుకు సర్వీస్ రోడ్లు ఉంటాయి. అయితే గ్రేటర్ HYD చుట్టూ నిర్మిస్తున్న RRRకు సర్వీస్ రోడ్డు నిర్మించడం లేదు. దీనికి బదులు యాక్సిస్ పాత్ రోడ్లు నిర్మించాలని NHAI నిర్ణయించింది. కనెక్టివిటీని పెంచడంతోపాటు సులువుగా ఉండేలా నిర్ణయం తీసుకుంది. ఆర్ఆర్ఆర్ చుట్టూ ఎక్కువగా పొలాలు ఉండటంతో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ రోడ్లతో రైతులకు పొలాలకు కూడా వెళ్లేందుకు వీలుగా ఉండనుంది.
News December 1, 2025
HYD: గ్లోబల్ సమ్మిట్ విజన్ డాక్యుమెంట్.. ఇదీ సీఎం ప్లాన్

ఈ నెల 8,9 తేదీలల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రేపు సాయంత్రానికి ఆయా శాఖలకు సంబంధించి అధికారులు పూర్తి నివేదికను సమర్పించాలి. 3,4 తేదీలల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్షుణ్ణంగా పరిశీలించి 6 తేదీకి విజన్ డాక్యుమెంట్ రూపొందించాలన్నారు.


