News November 11, 2024
HYD: పోచమ్మ గుడి వద్ద మహాతాండవం ఆడుతా: అఘోరీ
శంషాబాద్‌లో ధ్వంసమైన పోచమ్మ గుడి వద్ద తాను మహాతాండవం ఆడబోతున్నట్లు అఘోరి తెలిపారు. గుంటూరు జిల్లాలోని కోటప్ప స్వామి ఆలయం వద్ద ఆమె మాట్లాడుతూ.. స్త్రీ శక్తి బయటకు వస్తే ఎవరూ తట్టుకోలేరన్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యానికి పాల్పడితే మగాళ్ల మర్మాంగాన్ని కోసేస్తానని హెచ్చరించారు. మహిళల కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేయడానికి సిద్ధమని పేర్కొన్నారు.
Similar News
News December 11, 2024
HYD: GHMC ఎన్నికలు.. భారీ ప్లాన్
GHMC ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా నేతలు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే మేయర్ పీఠం అని ఇటీవల బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. HYDలోని డివిజన్లలో భారీ ఎత్తున పాదయాత్రలు ఉంటాయని ఓ మంత్రి పేర్కొన్నారు. BRS, MIM ఎన్నికలపై స్పందించకపోయిన నగరవాసులు తమవైపు ఉంటారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, డివిజన్లు పెరిగే ఛాన్స్ ఉంది. పార్టీలు బలంగా ఉండడంతో చతుర్ముఖ పోరు తప్పేలా లేదు.
News December 11, 2024
HYD: ‘మళ్లీ మళ్లీ ఢిల్లీ.. ఇదే రేవంత్ లొల్లి’
HYD నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లటంపై ఎంపీ రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. ‘మళ్లీ మళ్లీ ఢిల్లీ.. ఇదే రేవంత్ లొల్లి. గల్లీలో అధికారం, ఢిల్లీలో బేరసారం. ప్రజలు వరదల్లో ఉన్నా, నిరుద్యోగులు రోడ్డెక్కినా, విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రులపాలైనా, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.. పదవులు నిలుపుకోవడానికి, కార్పొరేషన్ కమిషన్లకు ఢిల్లీ పోవాల్సిందే’ అంటూ మండిపడ్డారు.
News December 11, 2024
HYD: 5 రోజుల పాటు రాష్ట్రపతి పర్యటన
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.