News September 29, 2024

HYD: పోలీసన్నకు ఎంతటి కష్టం..

image

ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలబడే పోలీసన్న పరిస్థితి చూసి పలువురు కంటతడి పెట్టారు. పోలీసుల వివరాలు.. యూసుఫ్‌గూడ 1వ బెటాలియన్‌లో పోలీసు అధికారి జనార్ధన్ శ్వాస సమస్యతో ఓ హాస్పిటల్‌కు వెళ్లారు. ఆరోగ్య భద్రత కార్డు ఉన్నా.. యాజమాన్యం చికిత్సకు అంగీకరించలేదు. అక్కడి నుంచి మరో హాస్పిట్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. హెల్త్ కార్డ్ ఉన్నా తమకు తగిన గుర్తింపులేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు.

Similar News

News November 27, 2025

HYD: SSC JE ఎగ్జామ్ దరఖాస్తు చేశారా!

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూనియర్ ఇంజినీర్ (JE) పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న వారికి HYD రీజియన్ అధికారి డా.ప్రసాద్ ముఖ్య సూచన చేశారు. ఎగ్జామ్స్ స్లాట్ సెలక్షన్ చేసుకుని అభ్యర్థులు లాగిన్ ఆప్షన్ ద్వారా ఫీడ్‌బ్యాక్ ఓపెన్ చేసి HYD ఎగ్జామ్ సిటీ లొకేషన్ ఎంచుకోవాలని సూచించారు. ఎంపిక కోసం DEC 28 వరకు గడువు ముగుస్తుందని తెలిపారు.

News November 27, 2025

ఇకనుంచి జలమండలిలో వాటర్ ఆడిట్‌: ఎండీ

image

ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ అశోక్ రెడ్డి వాటర్ ఆడిట్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జలమండలిలో వాటర్ ఆడిట్‌ను ప్రారంభించామన్నారు. నీటి శుద్ధి కేంద్రాలు, ట్రాన్స్‌మిషన్‌లైన్లు, రిజర్వాయర్ల పర్యవేక్షించడానికి రూపొందించిన ఈ టెక్నాలజీని ఇప్పటికే ఉన్న స్కాడా ఇంటిగ్రేషన్ చేయడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు.

News November 27, 2025

సిగాచీ పేలుళ్ల దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం

image

సిగాచీ పేలుళ్ల దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం న్యాయవేదికను కదిలించింది. 54 ప్రాణాలు బలిగొన్న ఘోర విషాదం ఇంకా స్పష్టమైన నిజానిజాలు లేకుండానే సాగిపోతుందని కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిపుణుల కమిటీ నివేదికలు, సాక్షాలు, చట్టపరమైన లోపాలన్నీ ముందుంచినా దర్యాప్తు పురోగతి శూన్యంగా ఉందని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ వచ్చేనెల 9కి వాయిదా వేసింది.