News September 29, 2024

HYD: పోలీసన్నకు ఎంతటి కష్టం..

image

ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలబడే పోలీసన్న పరిస్థితి చూసి పలువురు కంటతడి పెట్టారు. పోలీసుల వివరాలు.. యూసుఫ్‌గూడ 1వ బెటాలియన్‌లో పోలీసు అధికారి జనార్ధన్ శ్వాస సమస్యతో ఓ హాస్పిటల్‌కు వెళ్లారు. ఆరోగ్య భద్రత కార్డు ఉన్నా.. యాజమాన్యం చికిత్సకు అంగీకరించలేదు. అక్కడి నుంచి మరో హాస్పిట్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. హెల్త్ కార్డ్ ఉన్నా తమకు తగిన గుర్తింపులేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు.

Similar News

News October 11, 2024

తెలంగాణ ఉద్యమకారుల కమిటీ రద్దు: పిడమర్తి రవి

image

తెలంగాణ ఉద్యమకారుల సంఘానికి సంబంధించిన కమిటీని రద్దు చేస్తున్నట్లు సంఘం వ్యవస్థాపకులు డా. పిడమర్తి రవి గురువారం వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కమిటీలో ఉన్న ఛైర్మన్ ఇనుప ఉపేందర్, అధ్యక్షుడు దాసర్ల శ్రీశైలం, కన్వీనర్ MD రహీమ్ కూడిన కమిటీని వెంటనే రద్దు చేస్తున్నామని ప్రకటించారు. త్వరలోనే తదుపరి కమిటీని ప్రకటిస్తామని ఆయన వివరించారు.

News October 10, 2024

HYD: ఉత్తమ్ తండ్రికి నివాళులర్పించిన అగ్రనేతలు

image

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, మందకృష్ణ మాదిగ హాజరై పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు.

News October 10, 2024

HYD: ప్రజారోగ్య అడిషనల్ డైరెక్టర్‌గా కాకుమాను శశిశ్రీ

image

తెలంగాణ డైరెక్టరేట్ పబ్లిక్ హెల్త్ అడిషనల్ డైరెక్టర్ (అడ్మిన్)గా కాకుమాను శశిశ్రీ బాధ్యతలు చేపట్టారు. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి డా.క్రిస్టినా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆమె ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. వైద్య ఆరోగ్యశాఖలో అపారమైన అనుభవం కలిగిన అధికారి రావడంతో అధికారులు, ఉద్యోగులు పట్లఉద్యోగులు వర్షం వ్యక్తం చేశారు.