News March 11, 2025

HYD: పోలీసులను అభినందించిన సీపీ

image

బంగ్లాదేశీ మహిళల అక్రమ రవాణాను అరికట్టి బాధితులను ప్రజ్వల షెల్టర్ హోమ్‌కు తరలించిన ఘటనలో ప్రతిభ కనబరిచిన ఫిలింనగర్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, పంజాగుట్ట కానిస్టేబుల్ లావణ్యకు HYD సీపీ సీవీ ఆనంద్ రివార్డులు అందజేశారు. మహిళల అక్రమ రవాణాను అరికట్టడంలో వీరు చూపిన శ్రద్ధ, అంకితభావాన్ని కొనియాడారు. వీరందరిని పునరావాస కేంద్రానికి తరలించడంలో కీలకపాత్ర పోషించారన్నారు.

Similar News

News March 23, 2025

SUNDAY.. HYDలో ఫ్యాన్స్ జోరు..!

image

హాలిడే రోజు HYD హోరెత్తనుంది. క్రికెట్ ఫ్యాన్స్‌ కోసం ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. గతేడాది సిక్సర్ల మోతతో హోమ్ గ్రౌండ్‌లో రికార్డులు సృష్టించిన SRH ఈ సీజన్‌లో కూడా విధ్యంసం సృష్టిస్తుందని హైదారాబాదీలు ఎదురుచూస్తున్నారు. ‘IPL-18’లో నేడు SRH.. RRతో తలపడనుంది. ఉప్పల్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను హబ్సిగూడ X రోడ్ వద్ద మళ్లిస్తారు. రామంతాపూర్ నుంచి వచ్చే వాహనాలు స్ట్రీట్ నం.8 ద్వారా UPL X రోడ్‌కు మళ్లిస్తారు.

News March 23, 2025

కడ్తాల్: అందాల పోటీలకు పైసలు ఎక్కడివి: సర్పంచుల సంఘం

image

గ్రామ పంచాయతీల్లో సర్పంచులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులకు డబ్బులు లేవంటున్న ప్రభుత్వం అందాల పోటీలకు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని మాజీ సర్పంచ్, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనరసింహారెడ్డి ప్రశ్నించారు. శనివారం కడ్తాల్‌లో మాట్లాడుతూ.. సొంత నిధులు వెచ్చించి గ్రామాల అభివృద్ధి చేసిన సర్పంచులకు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తుందని ఆరోపించారు. మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు.

News March 23, 2025

నేడు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సన్నాహక సమావేశం

image

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సన్నాహాక సమావేశం ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరంగర్‌లో ఉంటుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ అన్నారు. ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హాజరవుతున్నారని చెప్పారు. కావున జిల్లా ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, కాంగ్రెస్ అన్ని విభాగాల ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.

error: Content is protected !!