News June 7, 2024
HYD: పోలీసులను చూసి పారిపోతూ వ్యక్తి మృతి

HYD తార్నాకలోని లాలాగూడ PS పరిధిలో విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాలు.. లాలాపేట్‌లో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా ఆడుతున్న పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. దీంతో పోలీసులను చూసిన వినయ్ అనే వ్యక్తి పారిపోతూ మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకి మృతిచెందాడు. అయితే టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొట్టడంతో తట్టుకోలేక బిల్డింగ్ పై నుంచి దూకాడని ఆరోపిస్తూ అతడి స్నేహితులు ఆందోళనకు దిగారు.
Similar News
News February 11, 2025
HYD: మూసీకి రూ.37.50 కోట్లు కేటాయింపు!

మూసీ నది అభివృద్ధి సంస్థకు రూ.37.50 కోట్లు కేటాయిస్తూ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. మూసీ ప్రక్షాళన అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులను తరలించేందుకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 1,500 కుటుంబాలను గుర్తించారు. ఒక్కో కుటుంబానికి రూ.25,000 అందించనున్నట్లు పేర్కొన్నారు.
News February 11, 2025
HYD: ట్యాంకర్ బుకింగ్ కోసం కాల్ చేయండి

వేసవి దృష్ట్యా జలమండలి అధికారులు ముందస్తు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఏ ప్రాంతంలో ట్యాంకర్లు ఎక్కువగా బుక్ చేస్తున్నారో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. ఆ ప్రాంతాల జాబితాను స్థానిక అధికారులకు అందించి అదనపు ఫిల్లింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వేసవిలో బుక్ చేసుకున్న రోజే ట్యాంకర్ వస్తుందని, బుకింగ్ కోసం 155313కి కాల్ చేయాలని సూచించారు. దళారులను నమ్మి మోసపొవద్దని హెచ్చరించారు.
News February 11, 2025
HYD: నేటి నుంచి భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్

HYD ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11 రోజులపాటు రద్దవుతున్నట్లు ప్రకటించిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. నేడు SECలో బయల్దేరి భువనగిరి, కాజీపేట్, పెద్దపల్లి, కాగజ్‌నగర్ వెళ్తుంది. మళ్లీ 15న సికింద్రాబాద్ చేరుకుంటుందని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.