News August 27, 2024

HYD: పోలీసు సిబ్బందికి సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

image

అవినీతి, అక్రమాలకు పాల్పడిన పోలీసు సిబ్బందిని ఇక నుంచి ఉద్యోగం నుంచి తొలగించడమేనని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. బోరబండ, మధురానగర్ పీఎస్‌లలో పోలీసులు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు సీపీ స్పందించారు. పంజాగుట్ట ఠాణా మాదిరిగా వీటిని ప్రక్షాళన చేస్తామన్నారు. ఫిర్యాదులపై విచారణ కొనసాగించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు జాగ్రత్తగా పని చేయాలన్నారు.

Similar News

News February 26, 2026

HYD: రూ.2వేల కోట్లతో ఆవుల పంపిణీ

image

రాష్ట్రంలో పాల దిగుబడిని పెంచేందుకు పశుసంవర్థకశాఖ రూ.2వేల కోట్లతో కొత్త పథకాన్ని అమలు చేయనుంది. HYD మినహాయించి అన్ని జిల్లాల్లో ఈ పథకం అమలు అవుతుంది. ప్రతి జిల్లాలో ఏటా 830 మంది రైతులకు 2 చొప్పున ఆవులను సబ్సిడీపై అందించనున్నారు. మూడేళ్లలో మొత్తం 79,680 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్క యూనిట్ ఖర్చు రూ.2,51,000గా అంచనా వేయగా 50% రైతు 50% సబ్సిడీ అందిస్తుంది.

News February 26, 2026

HYD: తల్లి మరణించినా ఎగ్జామ్‌కు హాజరు

image

HYD శివారు శంకర్‌పల్లిలో హృదయాన్ని కదిలించిందీ ఘటన. కేజీబీవీలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న కల్పన (40) మంగళవారం రాత్రి మరణించారు. బుధవారమే ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో, ఆమె కుమారుడు రవితేజ మాత్రం పరీక్షకు వెళ్లాలనుకున్నాడు. తల్లి మృతదేహం ఇంట్లోనే ఉండగా.. పరీక్ష పూర్తి చేసి అనంతరం తల్లి అంత్యక్రియలకు హాజరయ్యాడు.

News February 26, 2026

చర్లపల్లి: ఖైదీలకు నూనె తయారీపై శిక్షణ

image

చర్లపల్లి ఖైదీల వ్యవసాయ కాలనీ(పీఏసీ)లోని ఆయుర్వేద గ్రామంలో కోల్డ్‌ ప్రెస్‌ ఆయిల్‌ యూనిట్‌ను జైళ్ల శాఖ డీజీ డా.సౌమ్య మిశ్రా ప్రారంభించారు. 6 సంవత్సరాల విరామం అనంతరం ఆయుర్వేద గ్రామాన్ని పునః ప్రారంభించారు. ఖైదీల సంక్షేమం, పునరావాసానికి ఈ శిక్షణ కేంద్రం దోహదపడుతుందని ఆమె స్పష్టంచేశారు. కార్యక్రమంలో DIGలు శ్రీనివాస్, సంపత్, సూపర్డెంట్లు భరత్ ప్రమోద్, ఆయుర్వేద వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.