News August 27, 2024
HYD: పోలీసు సిబ్బందికి సీపీ స్ట్రాంగ్ వార్నింగ్
అవినీతి, అక్రమాలకు పాల్పడిన పోలీసు సిబ్బందిని ఇక నుంచి ఉద్యోగం నుంచి తొలగించడమేనని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. బోరబండ, మధురానగర్ పీఎస్‌లలో పోలీసులు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు సీపీ స్పందించారు. పంజాగుట్ట ఠాణా మాదిరిగా వీటిని ప్రక్షాళన చేస్తామన్నారు. ఫిర్యాదులపై విచారణ కొనసాగించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు జాగ్రత్తగా పని చేయాలన్నారు.
Similar News
News September 10, 2024
HYD: గండిపేట చెరువులో భారీ చేప (PHOTO)
ఇటీవల కురుస్తోన్న భారీ వర్షాలు, వరదలకు గండిపేట చెరువు నిండుకుండలా మారింది. దీంతో జాలరులు చేపల వేట కొనసాగిస్తున్నారు. సోమవారం మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌కి చెందిన కొంతమంది చేపల వేటలో పడ్డారు. దాదాపు 12 కిలోలకు పైగా చేప వలకు చిక్కింది. ఇది తెలుసుకున్న యువత గాళాలు వేసి చేపలు పట్టేందుకు ఆసక్తి చూపించారు.
News September 10, 2024
HYD: మరణంలోనూ వీడని స్నేహం
HYD శివారు షాద్‌నగర్ సమీపంలోని ఎలికట్ట శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. కొందర్గు మండలానికి చెందిన కరుణాకర్, శేఖర్ ప్రాణ స్నేహితులు. వీరు ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లేవారు. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు షాద్‌నగర్‌లో కలుసుకున్నారు. మద్యం సేవించి బైక్‌పై ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు.
News September 10, 2024
హైదరాబాద్‌లో మొదలైన సందడి
HYDలో వినాయక నిమజ్జనాల సందడి మొదలైంది. 3 రోజుల పాటు పూజలు అందుకున్న చిట్టి గణనాథులు ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటున్నాయి. సోమవారం సా. నుంచే వందల సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. ఈ నెల 11, 13, 15, 17న ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు ట్యాంక్‌బండ్‌కు వస్తారు. ‘జై బోలో గణేశ్ మహారాజ్‌కి జై’ నినాదాలతో HYD హోరెత్తనుంది.