News June 5, 2024

HYD: ప్చ్.. డిపాజిట్ కోల్పోయిన పద్మారావు

image

ప్రజా నాయకుడిగా పేరు తెచ్చుకొన్న పజ్జన్న‌ను MP ఎన్నికల్లో జనాలు ఆదరించలేదు. ఎన్నికల ముందు సికింద్రాబాద్‌లో BRS VS BJP అని‌ ఆ పార్టీ శ్రేణులు‌ భావించాయి. కానీ, నిన్నటి ఫలితాల్లో ఆయన డిపాజిట్ కోల్పోయారు. 1, 2 మినహాయిస్తే.. అన్ని రౌండ్లలో BRS మూడో స్థానంలో నిలిచింది. ఫలితంగా 1,29,586(12.37%) ఓట్లకే పరిమితం కావడం గమనార్హం. తొలిసారి MPగా పోటీ చేసిన MLA పద్మారావు ఘోర పరాజయాన్ని మూటగట్టుకొన్నారు.

Similar News

News November 4, 2025

బోయిన్‌పల్లిలో దారుణం.. చిన్నారిపై డాన్స్ మాస్టర్ వేధింపులు

image

ఓల్డ్‌ బోయిన్‌పల్లిలోని సుబ్బు డాన్స్‌ స్టూడియో నిర్వాహకుడు జ్ఞానేశ్వర్‌ నాలుగేళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. 2 నెలలుగా డాన్స్ స్కూల్‌కు వెళ్తున్న చిన్నారి ఈమధ్య ఆకస్మికంగా మానేసింది. చిన్నారి చెప్పిన వివరాల మేరకు తల్లిదండ్రుల ఫిర్యాదుతో బోయిన్‌పల్లి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. స్టూడియోను మూసివేసినట్లు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్‌ తెలిపారు.

News November 4, 2025

BREAKING: జూబ్లీపోరులో BJPకి జనసేన సపోర్ట్

image

జూబ్లీహిల్స్ బైపోల్ వేడి తారస్థాయికి చేరింది. బీజేపీకి జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్‌గౌడ్ భేటీ అయ్యి, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. తమ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా జనసేన నాయకులు ప్రచారంలో పాల్గొననున్నట్లు ఇరు పార్టీలు వెల్లడించాయి.

News November 4, 2025

సర్కారు వారి పాట.. ఎకరం రూ.99 కోట్లు

image

రూ.1,2 కోట్లు కాదు.. రూ.99 కోట్లు.. ఇదీ కోకాపేటలోని ఒక ఎకరానికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర. ఈ మొత్తం చెల్లిస్తే ఎకరం సొంతం చేసుకోవచ్చు అనుకుంటే పొరపాటే. దీనికి వేలం వేస్తారు. అంటే ఈ రేటు డబుల్ కావచ్చు. ఈ నెల 24, 28 తేదీలతోపాటు వచ్చేనెల 3, 5 తేదీల్లో ప్రభుత్వం ఈ-వేలం వేయనుంది. ఈ మేరకు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో కనీసం రూ.150 కోట్లైనా సంపాదించాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.