News January 30, 2025
HYD: ప్యాలెస్ CM KCR.. ప్రజల CM రేవంతన్న: సామ

‘ప్యాలెస్ CM KCR.. ప్రజల CM రేవంతన్న అని TGలో ఏ గల్లీలో తిరిగే చిన్న పోరణ్ని అడిగినా చెబుతాడు.. ప్రజాధనంతో ప్యాలెస్లు కట్టింది ఎవరో.. గడీల పాలన చేసింది ఎవరో ప్రజలకు తెలుసు.. ప్యాలెస్ CM అని హరీశ్రావు రేవంతన్నను అనడం విడ్డూరం.. ఆయన పనితీరు చూసి BRS వాళ్లకు కడుపు మంట.. అహంకారంతో ఉన్న BRS గురించి ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోండి..’ అని TPCC మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి నేడు ఫైరయ్యారు.
Similar News
News November 20, 2025
కాకినాడ జీజీహెచ్లో వృద్ధులకు ‘ఆదివారం’ ప్రత్యేక ఓపీ

రాష్ట్రంలోనే తొలిసారిగా కాకినాడ ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్)లో వయోవృద్ధుల కోసం ప్రత్యేక ఓపీ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి తెలిపారు. ఈ నెల 23 నుంచి ప్రతి ఆదివారం 65 ఏళ్లు పైబడిన వారికి ఓపీ నంబర్-4లో రిటైర్డ్ ప్రొఫెసర్లు వైద్యం అందిస్తారన్నారు. చికిత్స కోసం వచ్చే వారు ఆధార్ కార్డు తీసుకురావాలని, పరీక్షలతో పాటు ఉచితంగా మందులు అందజేస్తామని ఆమె వెల్లడించారు.
News November 20, 2025
రేగుపాలెం: యాక్సిడెంట్.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ఎలమంచిలి మండలం రేగుపాలెం సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. తుని నుంచి అనకాపల్లి వైపు వెళుతున్న బైక్, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ బోల్తా పడడంతో దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరు ఎలమంచిలి మున్సిపాలిటీ కొత్త ఎర్రవరం గ్రామానికి చెందిన వారిగా సమాచారం. ఈ ఘనటపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 20, 2025
మరో ఉగ్ర దాడికి జైషే కుట్ర?

పాక్ ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ మన దేశంలో మరో దాడికి కుట్ర చేస్తోందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆత్మాహుతి స్క్వాడ్ను సిద్ధం చేస్తోందని హెచ్చరించాయి. ‘ఇందుకోసం జైషే నాయకులు డిజిటల్ మార్గాల్లో నిధుల సేకరణకు పిలుపునిచ్చారు. ₹6,400 చొప్పున ఇవ్వాలని అడుగుతున్నారు. వారు మహిళల నేతృత్వంలో దాడికి కుట్ర పన్నుతున్నారు’ అని తెలిపాయి. ఢిల్లీ పేలుడు ఘటనలో జైషే హస్తం ఉందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.


