News January 30, 2025

HYD: ప్యాలెస్ CM KCR.. ప్రజల CM రేవంతన్న: సామ

image

‘ప్యాలెస్ CM KCR.. ప్రజల CM రేవంతన్న అని TGలో ఏ గల్లీలో తిరిగే చిన్న పోరణ్ని అడిగినా చెబుతాడు.. ప్రజాధనంతో ప్యాలెస్‌లు కట్టింది ఎవరో.. గడీల పాలన చేసింది ఎవరో ప్రజలకు తెలుసు.. ప్యాలెస్ CM అని హరీశ్‌రావు రేవంతన్నను అనడం విడ్డూరం.. ఆయన పనితీరు చూసి BRS వాళ్లకు కడుపు మంట.. అహంకారంతో ఉన్న BRS గురించి ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోండి..’ అని TPCC మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి నేడు ఫైరయ్యారు.

Similar News

News February 18, 2025

KMR: టీచరే కీచకుడిగా మారాడు

image

గాంధారి మండలంలో సమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. SI ఆంజనేయులు వివరాలిలా.. మండలంలోని ప్రభుత్వ పాఠశాల టీచర్ రమేశ్ అదే పాఠశాలలో చదువుకునే విద్యార్థినిని సబ్జెక్టుకు సంబంధించిన విషయాలు ఫోన్లో చెబుతానని తల్లిదండ్రుల ఫోన్ నంబర్ తీసుకొని అసభ్యకర మెసేజ్‌లు చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 18, 2025

బావ కోసం హెలికాప్టర్ ఏర్పాటు చేసిన బావమరిది!

image

బావమరిది బతుకగోరతాడని సామెత. బిహార్‌లోని వైశాలి ప్రాంతంలో ఓ బావమరిది తన సోదరి భర్త కోసం ఏకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేశాడు. పెళ్లైన తర్వాత తొలిసారిగా అతడి సోదరి భర్తతో పుట్టింటికి వస్తుండటంతో వాళ్లు చాలా గ్రాండ్‌గా రావాలని పట్నా నుంచి వైశాలి వరకూ 30 కిలోమీటర్ల దూరం మేర హెలికాప్టర్‌లో తీసుకొచ్చాడు. ఈ వేడుకను తిలకించేందుకు స్థానికులు వారి ఇంటి వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు.

News February 18, 2025

కామారెడ్డి: హత్య చేశారా.. కాల్చి చంపారా

image

లింగంపెట్ మండలం భానాపూర్ అటవీ ప్రాంతంలో పోచయ్య(70) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి హత్య చేశారు. పోచయ్య స్వగ్రామం పిట్లం మండలంలోని బోలక్ పల్లి గ్రామంగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు పిట్లం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. హత్య చేసింది పరిచయస్తుడే అనే కోణంలో పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!