News January 17, 2025
HYD: ప్రకటనకు విరుద్ధంగా RTC ఛార్జీల బాదుడు..!

సంక్రాంతి పండుగ వేళ తిరుగు ప్రయాణంలో JAN 19, 20 తేదీల్లో మాత్రమే అదనపు ఛార్జీలు స్పెషల్ బస్సుల్లో అమలులో ఉంటాయని ప్రకటించిన ఆర్టీసీ అందుకు విరుద్ధంగా ప్రయాణికుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తోంది. MHBD జిల్లా తొర్రూరు నుంచి మేడ్చల్ జిల్లా ఉప్పల్ X రోడ్డు వెళ్లే సంక్రాంతి స్పెషల్ బస్సులో నేడు కూడా అదనపు ఛార్జీలు వసూలు చేసినట్లు ప్రయాణికులు తెలిపారు. మిగతా చోట్ల సైతం వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు.
Similar News
News December 22, 2025
రంగారెడ్డి జిల్లా రిటైర్డ్ DMHOపై ఫిర్యాదు

వనస్థలిపురం PS పరిధిలోని హస్తినాపురంలో ఉన్న అరుణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేరును అక్రమంగా, ఆరుష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మార్చారని రంగారెడ్డి జిల్లా రిటైర్డ్ DMHO, ప్రస్తుత DEMOపై ఆరోపణలు వచ్చాయి. గతంలో అదే హాస్పిటల్‌కు MDగా పనిచేసిన Dr.దేవేందర్ RR కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో ఈమేరకు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్‌పై ఎన్నో కేసులు ఉన్నా.. పేరు ఎలా మారిందని ప్రశ్నించారు.
News December 22, 2025
RR: నేడు సర్పంచ్ సాబ్, మేడమ్ వస్తున్నారు!

సర్పంచ్‌లు, వార్డు సభ్యులు నేడు వారి వారి గ్రామపంచాయతీల్లో ప్రమాణం చేయనున్నారు. రంగారెడ్డి జిల్లాలో 3 విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 526 GPలకు 525 గ్రామాల్లో కొత్త పాలకవర్గాలను ఎన్నుకున్నారు. నేడు వారితో పంచాయతీ సెక్రటరీలు ప్రమాణం చేయిస్తారు. కాగా జిల్లాలో మాడ్గుల మండలంలోని నర్సంపల్లి GPకి ఎన్నిక జరగలేదు. ప్రమాణ స్వీకారంపై జిల్లాలోని MPDOలు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.
News December 22, 2025
అజ్మీర్ దర్గా ఉర్సుకు కేసీఆర్ చాదర్ సమర్పణ

అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏడాది పార్టీ తరఫున చాదర్ సమర్పించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈ సంవత్సరం కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాదర్ సమర్పించారు. కార్యక్రమంలో మాజీ హోం మంత్రి మహమూద్ అలీతో పాటు పార్టీ మైనారిటీ విభాగానికి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.


