News April 18, 2024
HYD: ప్రజలారా.. జాగ్రత్త..! ఎండ దంచి కొడుతోంది
HYD, RR, MDCL, VKB జిల్లాలలో నేటి నుంచి రాగల 5 రోజుల వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ తెలియజేసింది. ఏకంగా 41 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. పలుచోట్ల వేడిగాలులు వీచే అవకాశం ఉందని, కావున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేసింది.
Similar News
News September 15, 2024
HYD: 16న నాగపూర్-సికింద్రాబాద్ ‘వందే భారత్’ ప్రారంభం
నాగపూర్ నుంచి సికింద్రాబాద్(SEC) మార్గంలో ఈ నెల 16న వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. నాగపూర్ నుంచి ఉ.5 గంటలకు బయలుదేరి మ.12:15కు SEC చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో SEC నుంచి మ.1 గంటకు బయలుదేరి రా.8:20కు నాగపూర్ చేరుకుంటుంది.కాజీపేట, రామగుండం, బల్లార్ష, చంద్రాపూర్, సేవగ్రాంలో హాల్టింగ్ ఉంటుంది.
News September 15, 2024
గణపతి నిమజ్జనానికి A-Z సర్వం సిద్ధం: ఆమ్రపాలి
HYD సరూర్‌నగర్ చెరువు, జీడిమెట్ల ఫాక్స్ సాగర్, బహదూర్‌పుర మీరాలం, కాప్రా ఊర చెరువులో గణేశ్ నిమజ్జనానికి A-Z సిద్ధం చేసినట్లు GHMC కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. 172 రోడ్ల మరమ్మతులు, 36 ట్రాన్స్‌పోర్ట్, 140 స్టాటిక్ క్రేన్‌లు, 295 మొబైల్ క్రేన్స్, 160 గణేశ్ యాక్షన్ టీమ్స్, 102 మినీ టిప్పర్లు, 125 జేసీబీలు, 308 మొబైల్ టాయిలెట్స్, 52,270 తాత్కాలిక స్ట్రీట్ లైట్స్ సిద్ధం చేసినట్లు చెప్పారు.
News September 15, 2024
సికింద్రాబాద్: 15,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు
గ్రేటర్ పరిధిలో గణేశ్ నిమజ్జనం కోసం 15,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీఆనంద్ తెలిపారు. ట్యాంక్ బండ్ సహా ఇతర అన్ని చెరువుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నిమజ్జనం రోజున ఉండే వేరే కార్యక్రమాలకు ప్రత్యేకంగా బందోబస్తు ఇస్తున్నామన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులతో పాటు ఇతర జిల్లాల నుంచి ప్రత్యేక సిబ్బందిని తెస్తున్నామన్నారు.