News April 7, 2024
HYD: ప్రజల కష్టసుఖాలు తెలిసిన ఏకైక పార్టీ కాంగ్రెస్: సునీతారెడ్డి

ప్రజల కష్టసుఖాలు తెలిసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీతామహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి నిజాంపేట్‌కు చెందిన వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి సాదరంగా ఆమె ఆహ్వానించి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పట్టుదలతో పని చేయాలని సూచించారు.
Similar News
News May 7, 2025
హయత్‌నగర్: ప్రాణం తీసిన మస్కిటో కాయిల్

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భువనేశ్వరినగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అబ్దుల్ ఖాదర్ జిలానీ ఇంట్లో దోమల కోసం పెట్టిన మస్కిటో కాయిల్ అతని కుమారులు అబ్దుల్ రెహమాన్ (4), అతిఫా(4) పడుకున్న పరుపు పై పడింది. నిప్పు అంటుకోవడంతో పరుపు పూర్తిగా కాలిపోగా.. ఆ పొగతో ఊపిరి ఆడక రెహమాన్ మృతి చెందాడు. అతిఫా అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
News May 7, 2025
నేడు ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండేషన్ డే

ఉస్మానియా విశ్వవిద్యాలయం 108వ స్థాపనా దినోత్సవాన్ని వేడుకలు ఇవాళ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో MLC ప్రొ.కోదండరాం, మాజీ ఎంపీ K.కేశవరావు, సీపీ CV ఆనంద్, గాయకుడు అందెశ్రీ, వీసీ ప్రొ.కుమార్ మోలుగారం పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.
News May 7, 2025
HYDలో 3 ప్రాంతాల్లో వ్యభిచారం.. అరెస్ట్

HYDలో వ్యభిచార స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత 48 గంటల్లో 3 చోట్ల ఈ ముఠాలకు చెక్ పెట్టారు. గురువారం బంజారాహిల్స్‌లో ఇద్దరు యువతులతో విటులు పట్టుబడ్డారు. శుక్రవారం లాలాగూడలో వ్యభిచారం చేయిస్తూ ఉగండా దేశస్థులు చిక్కారు. శ్రీనగర్‌కాలనీలోని ఓ స్పా సెంటర్‌లో తనిఖీ చేయగా ఆరుగురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలింది. అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.