News September 7, 2024

HYD: ప్రజల ఫిర్యాదులపై అలసత్వం వద్దు: ఎండీ

image

గ్రేటర్ HYDలోని పలు ప్రాంతాల్లో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మంచి నీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణపై అలసత్వం వహిస్తే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. సీవరేజ్ ఓవర్ ఫ్లో విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఎండీ అసహనం వ్యక్తం చేశారు. వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు చేసి సేవలపై ఆరా తీశారు.

Similar News

News November 18, 2025

సికింద్రాబాద్ MRO ఆఫీసులో ఏసీబీ సోదాలు

image

సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా సర్వేయర్ కిరణ్ పట్టుబడ్డాడు. ఎమ్మార్వో కార్యాలయంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సర్వేయర్ కిరణ్‌తో పాటు చిన్న మెన్ భాస్కర్లను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

News November 18, 2025

సాంఘిక దురాచారాలపై పోరాటం అవసరం: చిన్నారెడ్డి

image

శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకెళ్తున్న ఈ ఆధునిక కాలంలోనూ దళితులు, గిరిజనులు, మహిళల పట్ల వివక్ష కొనసాగడం బాధాకరమని సీఎం ప్రజావాణి ఇన్‌ఛార్జి జి. చిన్నారెడ్డి అన్నారు. సాంఘిక దురాచారాలపై ప్రతి ఒక్కరూ సంఘటితంగా పోరాడాల్సిన బాధ్యత ఉందన్నారు. మంగళవారం ప్రజా భవన్‌లో సీఎం ప్రజావాణి, దళిత స్త్రీ శక్తి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన లీగల్ క్లినిక్ ప్రత్యేక కార్యక్రమంలో చిన్నారెడ్డి మాట్లాడారు.

News November 18, 2025

HYD: జేఎన్టీయూలో వేడుకలు.. హాజరు కానున్న సీఎం

image

జేఎన్టీయూలో డైమండ్ జూబ్లీ, గ్లోబల్ అలుమ్నీ వేడుకలు 2 రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల 21, 22 తేదీల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేశారు. అట్టహాసంగా జరిగే ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని ప్రిన్సిపల్ డా.భ్రమర తెలిపారు. 21న సీఎం రేవంత్ రెడ్డి, 22న మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరు అవుతారని పేర్కొన్నారు.