News April 7, 2025

HYD: ప్రజావాణి ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

image

హైదరాబాద్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 56 దరఖాస్తులు అందాయి. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. అందిన దరఖాస్తుల్లో గృహ నిర్మాణానికి సంబంధించినవి 18, పెన్షన్ 10, ఇతర శాఖలకు చెందినవి 28 ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Similar News

News February 24, 2026

HYD: గాంధీ విగ్రహం వద్దని గాంధీ మునిమనవడి ట్వీట్

image

మూసీ నది ఒడ్డున గాంధీ విగ్రహం కోసం ప్రజలను తరలించడం అత్యంత అగాంధేయ చర్య అని గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ అన్నారు. ఇళ్లను కూల్చి స్థలం కల్పించడం గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే నిలిపివేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. బాపు ఉండి ఉంటే ‘నా పేరుతో ఇలాంటి పనులు చేయొద్దు’ అని చెప్పేవారని తుషార్ గాంధీ Xలో ట్వీట్ చేశారు.

News February 24, 2026

HYD: 3 కార్పొరేషన్ల వెబ్‌సైట్లు ఇవే!

image

300 డివిజన్లతో కూడిన GHMC మూడుముక్కలైన విషయం తెలిసిందే. GHMC, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు సంబంధించిన వెబ్‌సైట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. GHMC వెబ్‌సైట్ www.ghmc.gov.in, సైబరాబాద్ కార్పొరేషన్ cmc.telangana.gov.in, మల్కాజిరి కార్పొరేషన్ mmc.telangana.gov.in వెబ్‌సైట్లలో ప్రజలు సేవలు పొందొచ్చని అధికారులు తెలియజేశారు.
# SHARE IT

News February 24, 2026

థాయ్‌లాండ్‌లో కొత్త వైరస్.. జూపార్క్‌లో ‘బయో- బబుల్’

image

‘థాయ్‌లాండ్ మరణాలు ఒక హెచ్చరిక.. గాలి ద్వారా వైరస్ సోకకుండా అడ్డుకోవం మా లక్ష్యం’ అని నెహ్రూ జూపార్క్ సిబ్బంది తెలిపారు. శానిటైజేషన్‌కే పరిమితం కాకుండా, వన్యప్రాణుల మధ్య ‘సోషల్ డిస్టెన్సింగ్’ ఎన్‌క్లోజర్ల పర్యవేక్షణను పెంచారు. వైరస్ మ్యుటేషన్ చెందకుండా సోడియం హైపో క్లోరైడ్, జంతువుల ఆహారంలో రోగనిరోధక శక్తిని పెంచే సప్లిమెంట్లను ఇస్తున్నారు. మూగజీవాల ప్రాణాలను కాపాడేందుకు యుద్ధం అని వివరించారు.