News June 28, 2024

HYD: ప్రజావాణి కార్యక్రమానికి 494 దరఖాస్తులు

image

HYD బేగంపేట్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 494 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. ప్రజావాణి ప్రత్యేకాధికారిణి దివ్య, ఇతర అధికారులు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతోపాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News December 5, 2025

OU: ఈ నెల 22 నుంచి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాయిదాపడ్డ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (SET) పరీక్షలను ఈ నెల 22 నుంచి నిర్వహించనున్నట్లు సెట్ మెంబర్ సెక్రటరీ బి.శ్రీనివాస్ తెలిపారు. 3 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఈ విషయం గమనించాలని శ్రీనివాస్ కోరారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత పొందేందుకు ఈ సెట్ నిర్వహిస్తారు.

News December 5, 2025

గచ్చిబౌలి శాంతిసరోవర్‌లో ‘సండే ఈవినింగ్‌ టాక్‌’

image

బ్రహ్మకుమారీస్‌ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని శాంతిసరోవర్‌ క్యాంపస్‌లో ఆదివారం ‘సండే ఈవినింగ్‌ టాక్‌’ కార్యక్రమం నిర్వహించనున్నారు. సా.6:30 నుంచి రాత్రి 8 గం. వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ‘విలువ వినోదం’ (వాల్యూటెయిన్‌మెంట్‌) పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విలువల కార్యకలాపాలు, దైవిక గీతాలాపన, ధ్యాన అనుభవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

News December 5, 2025

విదేశీ అతిథులకు ఇంకా ఫైనల్ కాని ఫుడ్ మెనూ!

image

గ్లోబల్ సమ్మిట్‌లో ఫుడ్ మెనూపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. స్థానిక తెలంగాణ వంటకాలు షార్ట్‌లిస్ట్ అయినా విదేశీ అతిథులకు నచ్చే రుచి ఏదనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. తాజ్ కృష్ణ చెఫ్‌లు కాంటినెంటల్, థాయ్, మెక్సికన్ వంటి 20 రకాల వంటకాలను సిద్ధం చేసినట్టు సమాచారం. అతిథులకు అవసరమైన వంటకాల జాబితాను అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణ వంటకాల బాధ్యతను పర్యాటక శాఖ తీసుకుంది.