News February 11, 2025
HYD: ప్రజాసదుపాయం కోసం స్పెషల్ డ్రైవ్: GHMC

ఆక్రమణలలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు GHMC అధికారులు తెలిపారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్ సమస్యలను తగ్గించేందుకు పోలీసులతో కలిసి ఆక్రమణల తొలగింపు కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ నుంచి జనవరి వరకు ఎల్బీనగర్‌లో 11, శేరిలింగంపల్లిలో 243, సికింద్రాబాద్‌లో 81, కూకట్‌పల్లిలో 42, చార్మినార్‌లో 211, ఖైరతాబాద్ 156 ఆక్రమణలను తొలగించారు.
Similar News
News March 26, 2025
ఎల్బీనగర్‌లో మర్డర్.. నిందితుల అరెస్ట్

LBనగర్ శివగంగకాలనీలో మార్చి 23న పాతకక్షలతో మహేశ్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పురుషోత్తం, నాగార్జున, సందీప్, రాము, రాజరాకేశ్, కుంచల ఓంకార్ నిందితులుగా ఉన్నారు. వీరి నుంచి ఫోన్‌లు, బైకు, కారు, గొడ్డలి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు CI వినోద్ కుమార్ తెలిపారు.
News March 26, 2025
రేపు ఉప్పల్ వెళుతున్నారా.. ఇది మీ కోసమే!

రేపు ఉప్పల్ వేదికగా SRH VS LSG మ్యాచ్ కోసం TGSRTC స్పెషల్ బస్సులను నడుపుతోంది. 24 డిపోల నుంచి 60 స్పెషల్ బస్సులను స్టేడియానికి తిప్పనున్నారు. ఉప్పల్, చెంగిచెర్ల, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, విధాని, బర్కత్‌పురా, కాచిగూడ, ముషీరాబాద్, దిల్‌సుఖ్‌నగర్, జీడిమెట్ల, కూకట్‌పల్లి, మేడ్చల్, మియాపూర్, కంటోన్మెంట్, హఫీజ్‌పేట, రాణిగంజ్, ఫలక్‌నుమా, మెహదీపట్నం, HCU తదితర డిపోల బస్‌లు అందుబాటులో ఉంటాయి.
SHARE IT
News March 26, 2025
HYD: అమ్మానాన్న సారీ.. స్టేటస్ పెట్టి SUICIDE

మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో సోమేశ్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సోదరి వివాహం కోసం దాచిన డబ్బులతో పాటు సోమవారం జరిగిన IPLలో ఒక్కరోజే లక్ష పోగొట్టుకున్నాడు. దీంతో అతడు.. ‘నేను సూసైడ్ చేసుకోవాలని డిసైడయ్యా. డబ్బుల విషయంలో ఆత్మహత్యకు పాల్పడడం లేదు. నా మైండ్ సెట్ కంట్రోల్ కావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అమ్మానాన్న, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సారీ’ అని స్టేటస్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.