News February 25, 2025
HYD: ప్రతినిధులే కబ్జాలు చేస్తున్నారు: హైడ్రాకు ఫిర్యాదు

పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించి పలు లే ఔట్లలో కేటాయించిన స్థలాలను అక్కడి కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులే కబ్జా చేస్తున్నారని పలువురు పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైడ్రా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో హైడ్రా ఆడిషనల్ డైరెక్టర్ ఫైర్ పాపయ్య ఫిర్యాదులు స్వీకరించారు. కాలనీ రహదారులను కూడా వదలకుండా ముందుకు జరిగి ప్రహరీలు నిర్మిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Similar News
News February 24, 2026
మస్కట్ నరకం నుంచి విముక్తి.. క్షేమంగా కోనసీమకు!

మస్కట్‌లో తీవ్ర ఇబ్బందులు పడ్డ తాటిపాకకు చెందిన కర్రీ సౌజన్య, కందికుప్పకు చెందిన బొజ్జ లక్ష్మీదుర్గ మంగళవారం క్షేమంగా స్వగ్రామం చేరారు. ఉపాధి కోసం వెళ్లి అక్కడ పని దొరకక అవస్థలు పడుతున్న వీరిని కలెక్టర్ మహేశ్ కుమార్ చొరవతో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ద్వారా రప్పించారు. కుటుంబ సభ్యులు కలెక్టర్ ను ఆశ్రయించడంతో అధికారులు స్పందించి వారిని సురక్షితంగా స్వగ్రామాలకు చేర్చారు.
News February 24, 2026
కామారెడ్డి: మైనార్టీ కమిషన్ ఛైర్మన్‌కు స్వాగతం పలికిన కలెక్టర్

కామారెడ్డి జిల్లా కేంద్రానికి రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ తారిక్ అన్సారీ మంగళవారం వచ్చారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి జయరాజ్, ఆర్ఎల్సీ బషీర్, విజిలెన్స్ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
News February 24, 2026
BIG BREAKING.. రేపు NGKLకు కేటీఆర్ రాక!

నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర జాతర దాడిలో మరణించిన రెండు నెలల పసిపాప కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బుధవారం రానున్నారు. ఉదయం 10:30 గంటలకు ఆయన బాధితులను కలిసి ధైర్యం చెప్పనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు.


