News February 25, 2025
HYD: ప్రతినిధులే కబ్జాలు చేస్తున్నారు: హైడ్రాకు ఫిర్యాదు

పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించి పలు లే ఔట్లలో కేటాయించిన స్థలాలను అక్కడి కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులే కబ్జా చేస్తున్నారని పలువురు పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైడ్రా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో హైడ్రా ఆడిషనల్ డైరెక్టర్ ఫైర్ పాపయ్య ఫిర్యాదులు స్వీకరించారు. కాలనీ రహదారులను కూడా వదలకుండా ముందుకు జరిగి ప్రహరీలు నిర్మిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Similar News
News April 16, 2026
నిప్పుల కొలిమిలా సూర్యాపేట.. 3 రోజులు జాగ్రత్త

సూర్యాపేట జిల్లాలో రానున్న 3 రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరుకోగా, మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండలతో పాటు వడగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విన్నవించారు.
News April 16, 2026
గుంటూరులో హిరో బాలయ్య సందడి!

గుంటూరులో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సినీ నటి డింపుల్ హయాతి సందడి చేశారు. వీరిద్దరూ గురువారం ఓ నూతన జువెలరీ షోరూమ్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. షోరూమ్‌లో డిజైన్లను పరిశీలించిన బాలయ్య యాజమాన్యాన్ని అభినందించారు. తన ప్రియతమ నటుటులను చూసేందుకు అభిమానులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.
News April 16, 2026
‘కంకణం కట్టుకోవడం’ వెనుక ఎంతో అర్థం

ఒక పనిని కచ్చితంగా, దృఢ సంకల్పంతో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారని చెప్పే సందర్భంలో ‘కంకణం కట్టుకోవడం’ అనే జాతీయాన్ని వాడతాం. పెళ్లిళ్లు, శుభకార్యాలు, యజ్ఞాలు, వ్రతాలకు ముందు మణికట్టుకు కంకణ ధారణ చేస్తారు. ఇది మూడు/ఐదు పోగులతో ఉంటుంది. దీన్ని మామిడాకు/తమలపాకు/పసుపుకొమ్ముతో అలంకరిస్తారు. ఇలా చేస్తే ఆ కార్యం విజయవంతంగా పూర్తయ్యేందుకు సర్వేశ్వరుడు రక్షణగా ఉంటారని నమ్మకం.
<<-se>>#EPICSAYINGS<<>>


