News April 24, 2024
HYD: ప్రతి ఏటా పెరుగుతున్న గంజాయి!

శామీర్పేట, మేడ్చల్, కీసర, ఘట్కేసర్, జవహర్ నగర్ ప్రాంతాలలో గంజాయి కేసుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పైన పేర్కొన్న అన్ని ప్రాంతాల్లో కలిపి 2022లో 581 కిలోల గంజాయి పట్టుపడగా.. 2023లో 1,236 కిలోల గంజాయి పట్టుబడిందని తెలిపారు. గంజాయి క్రయవిక్రయాలను తగ్గించడం పై పోలీసులు ఈ ఏడాది స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 10, 2025
జూబ్లీహిల్స్ బై పోల్: డెమో తర్వాత అసలు ఓటింగ్!

రేపు సూర్యుడు ఉదయించే లోపే(5AM) జూబ్లీహిల్స్ బై పోల్లో పోటీలో ఉన్న క్యాండిడేట్లందరూ (58 మంది) ఓటేస్తారు. అది తాము వేసిన గుర్తుకే పడిందా? లేదా? అనేది నిర్ధారించుకుంటారు. డెమో ఓకే అయితేనే సంతృప్తి వ్యక్తం చేస్తారు. లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతారు. ఈ తతంగం పూర్తయిన తరువాత మోడల్ బ్యాలెట్ జరిగినట్లు PO అధికారికంగా ధ్రువీకరిస్తారు. ఆ తరువాత ఉదయం 7 గంటలకు అసలు ఎన్నిక మొదలవుతుంది.
News November 10, 2025
జూబ్లీ బైపోల్: సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ల వద్ద పారామిలటరీలు

జూబ్లీ ఉప ఎన్నిక కోసం EC మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 50 శాతానికి పైగా 65 ప్రాంతాల్లోని 226 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించారు. హైదరాబాద్ పోలీసులు, కేంద్ర బలగాలు సంయుక్తంగా బందోబస్తు నిర్వహించనున్నాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పారామిలటరీ బలగాలను మోహరించనున్నారు. NOV 14న ఓట్ల లెక్కింపు కోసం 42 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
News November 10, 2025
జూబ్లీ బైపోల్: పోలింగ్ కోసం 3 వేల మంది ఉద్యోగులు

రేపటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ స్టేడియం వేదికగా ఈవీఎంలు, వీవీప్యాట్ల డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు(+నోటా) బరిలో ఉండగా.. 4 బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నారు. 3 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు.


