News July 21, 2024

HYD: ప్రతి ఒక్కరూ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి..!

image

HYD నగరంలోని స్థానిక ఆధార్ సెంటర్లకు వెళ్లి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలని HYD ఆధార్ సెంటర్ అధికారులు చూపించారు. బ్యాంక్ సీడింగ్, డాక్యుమెంట్, అప్డేట్ ఆధార్, ఈ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ వంటి సేవలు పొందడం కోసం మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం ముఖ్యమన్నారు. రూ.50 చెల్లించి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చని, వెబ్‌లింక్ bhuvan-app3.nrsc.gov.in/aadhaar ద్వారా ఆధార్ సెంటర్లను చూసుకోండి.

Similar News

News December 5, 2024

HYD: పాన్ కార్డు కరెక్షన్స్.. ఇది మీ కోసమే!

image

HYD అమీర్‌పేట స్వర్ణ భారతి కాంప్లెక్స్ భవనంలో CSC హెడ్ ఆఫీసులో పాన్ కార్డు, పాస్ పోర్టు సర్వీసులు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాన్ కార్డులో పేరు, DOB మార్పులు చేర్పులు కూడా చేస్తామన్నారు. మిగతా సర్వీసులు సైతం అందుబాటులో ఉన్నాయని, అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
SHARE IT

News December 4, 2024

HYD: తార్నాక IICTలో ఉద్యోగాలు

image

55% మార్కులతో 10TH, ఇంటర్, ITI చేసిన అభ్యర్థులకు శుభవార్త. HYD తార్నాకలోని CSIR-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(IICT) టెక్నీషియన్‌ విభాగంలో 29 ఖాళీలు ఉన్నాయి. భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రూ. 500 చెల్లించి అప్లై చేసుకోవచ్చు. SC, ST, మహిళా అభ్యర్థులు ఫీజు లేకుండానే అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ: 26-12-2024.

SHARE IT

News December 4, 2024

HYDలో పెరిగిన కోడిగుడ్ల ధరలు

image

రాష్ట్ర వ్యాప్తంగా కోడిగుడ్ల ధరలు పెరిగాయి. హోల్ సేల్ మార్కెట్లో ధర రూ.5.90గా NECC నిర్ణయించింది. దీంతో HYDలోని పలు ప్రాంతాల్లో రిటైల్ మార్కెట్లో రూ.6.50 నుంచి రూ.7 వరకు అమ్ముతున్నారు. 4నెలల క్రితంతో పోల్చితే రూ.3 వరకు పెరిగాయి. చలికాలంలో గుడ్ల వినియోగం పెరగడంతో, క్రిస్మస్, న్యూ ఇయర్‌కు కేకులు తయారీలో వాడుతుండటంతో రేట్లు పెరిగినట్లు అమ్మకదారులు తెలిపారు. ధరలు మరింత పెరగుతాయని అంచనా.