News March 27, 2025
HYD: ప్రతి మంగళవారం క్యాన్సర్ స్క్రీనింగ్..!

రొమ్ము, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాస్థాయిలో త్వరలో స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అవగాహన లేక 60-70% మంది ఆలస్యంగా వైద్యం తీసుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు. దీనిని అరికట్టేందుకు HYD, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ఆరోగ్య మహిళ కేంద్రాల్లో ప్రతి మంగళవారం ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
Similar News
News December 6, 2025
దాతలు సమాజానికి నిజమైన స్ఫూర్తిప్రదాతలు: కలెక్టర్

విదేశాల్లో స్థిరపడి మాతృభూమిపై మమకారంతో ప్రజాసేవకు ముందుకొస్తున్న దాతలు నిజమైన స్ఫూర్తిప్రదాతలు అని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. శనివారం జీజీహెచ్లో ఆల్ ఫ్రెస్కో యాంపీ థియేటర్ ఆమె ప్రారంభించారు. సమాజ అభివృద్ధిలో దాతలను భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం పీ4 కార్యక్రమాన్ని సైతం అమలు చేస్తుందని తెలిపారు. జీజీహెచ్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.
News December 6, 2025
కర్నూలు స్మార్ట్ సిటీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి: కలెక్టర్

కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఏ.సిరి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్, సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వినియోగించి, నిరంతర తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఫ్లైఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్, రవాణా వ్యవస్థ, పార్కులు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు.
News December 6, 2025
ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.


