News April 10, 2024
HYD: ప్రతీకారం.. యువకుడి మర్డర్

బాచుపల్లి PS పరిధిలో ఈ నెల 1న జరిగిన పిల్లి తేజస్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన 9 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గత ఏడాది తన స్నేహితుడు తరుణ్ హత్యకు ప్రతీకారంగా తేజస్‌ను చంపేశారని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి 6 సెల్‌ఫోన్స్, 4 టూ వీలర్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
Similar News
News March 23, 2025
ఆర్మీలో దరఖాస్తులు ఆహ్వానం.. చివరి తేదీ ఏప్రిల్ 10

ఇండియన్ ఆర్మీలో వివిధ క్యాటగిరీలో నియామకానికి ఇండియన్ ఆర్మీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, అగ్నివీర్, స్టోర్ కీపర్ పోస్టుల భర్తీ కోసం టెన్త్, ఇంటర్ పాసైన అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. NCC అర్హత పొందిన అభ్యర్థులకు బోనస్ మార్కులు ఉంటారని తెలిపారు. పూర్తి సలహాల కోసం రిక్రూట్మెంట్ కార్యాలయం కోసం 040- 27740205 సంప్రదించాలన్నారు.
News March 23, 2025
ఫిలింనగర్: తల్లి డైరెక్షన్‌లో కొడుకుల చోరీ

ఫిలింనగర్ PS పరిధిలో ఇటీవల డైమండ్‌హిల్స్ కాలనీలో 32 తులాల బంగారం, రూ.4.5 లక్షల నగదు చోరీ అయింది. లేడీ డాన్ సనా బేగం ఈ చోరీ చేయించి, 10 తులాల బంగారం విక్రయిస్తూ రెండో కొడుకు సొహాయిల్‌తో సహా పట్టుబడింది. మిగిలిన ఇద్దరు కొడుకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సనాపై ఇప్పటివరకు 43 చోరీ కేసులు ఉన్నాయి. తల్లి డైరెక్షన్ ఇస్తే కొడుకులు రంగంలోకి దిగి చోరీలు చేస్తున్నట్లుగా పోలీసులు దర్యాప్తులో తేల్చారు.
News March 23, 2025
SUNDAY.. HYDలో ఫ్యాన్స్ జోరు..!

హాలిడే రోజు HYD హోరెత్తనుంది. క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. గతేడాది సిక్సర్ల మోతతో హోమ్ గ్రౌండ్‌లో రికార్డులు సృష్టించిన SRH ఈ సీజన్‌లో కూడా విధ్యంసం సృష్టిస్తుందని హైదారాబాదీలు ఎదురుచూస్తున్నారు. ‘IPL-18’లో నేడు SRH.. RRతో తలపడనుంది. ఉప్పల్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను హబ్సిగూడ X రోడ్ వద్ద మళ్లిస్తారు. రామంతాపూర్ నుంచి వచ్చే వాహనాలు స్ట్రీట్ నం.8 ద్వారా UPL X రోడ్‌కు మళ్లిస్తారు.