News April 9, 2025
HYD: ప్రతీ జోన్‌లో ఒక్కో ఫుడ్ టెస్టింగ్ సెంటర్..!

గ్రేటర్ HYD వ్యాప్తంగా మొత్తం జీహెచ్ఎంసీలో 6 జోన్లు ఉన్నాయి. ఒక్కో జోన్‌లో ఒక్కోటి చొప్పున 6 ఆహార పరీక్షల కేంద్రాల ఏర్పాటుకు దాదాపు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాలను చూపించాల్సిందిగా, ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటుకు ఒక్కోదానికి రూ.5 కోట్ల చొప్పున రూ.30 కోట్ల నిధులు కూడా అందజేయాల్సిందిగా ఫుడ్ సేఫ్టీ విభాగం జీహెచ్ఎంసీని కోరింది.
Similar News
News July 9, 2025
దేవీపట్నంలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

దేవీపట్నం మండలం పెద్దవుర గ్రామానికి చెందిన మిర్తివాడ రమణారెడ్డి బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందాడని అతని సోదరి వీరవేణి తెలిపారు. యానాం సమీపంలో కోనవానిపాలెం గ్రామంలో రొయ్యల చెరువు వద్ద వారం రోజుల కిందట కూలి పనికి వెళ్లి చెరువులో పడి మృతి చెందాడన్నారు. యజమాని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సోదరుడి మృతిపై అనుమానం ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
News July 9, 2025
HYD: 2023 ప్రతిభ పురస్కారాలు.. ఎంపికైంది వీరే

ఎలనాగ(కవిత), ప్రభల జానకి(విమర్శ), ఆర్.లక్ష్మీరెడ్డి(చిత్రలేఖనం), సంపత్ రెడ్డి(శిల్పం), రమేశ్ లాల్(నృత్యం), హరిప్రియ(సంగీతం), ప్రతాపరెడ్డి(పత్రికా రంగం), గుమ్మడి గోపాలకృష్ణ(నాటకం), పాపయ్య(జానపద కళ), ధూళిపాళ మహాదేవమణి (అవధానం), మలయవాసిని(ఉత్తమ రచయిత్రి), శాంతి నారాయణ(నవల/కథ) పురస్కారాలకు ఎంపికయ్యారని తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ హనుమంతరావు తెలిపారు. వీరికి 19న పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.
News July 9, 2025
వీరవల్లి: మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు

మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. వీరవల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు.. పొట్టిపాడుకు చెందిన జస్వంత్ ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో హాస్టల్‌లో ఉంటున్నాడు. హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక అక్కడి నుంచి పారిపోవడంతో తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో యువకుడిని పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు.