News December 16, 2024
HYD: ప్రపంచ శాంతి కోసమే క్రిస్మస్ వేడుకలు: మంత్రి

క్రిస్మస్ ప్రారంభ వేడుకల్లో భాగంగా ఆదివారం సికింద్రాబాద్లోని మర్తోమా చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి చర్చి నిర్వాహకులు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ సోదరులు ఏటా ఎంతో పవిత్రంగా జరుపుకుంటారని అన్నారు.
Similar News
News October 31, 2025
HYD: ‘3 నెలల క్రితమే మంత్రి పదవిపై నిర్ణయం’

కిషన్రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు. అజార్పై ఉన్న కేసుల గురించి స్పష్టంగా చెప్పాలంటే కిషన్రెడ్డి ముందుకు రావాలని సవాల్ విసిరారు. 3 నెలల క్రితమే ఆయనకు మంత్రి పదవిపై నిర్ణయం తీసుకున్నామని, దీంతో మైనారిటీలకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.
News October 31, 2025
HYD సంస్థానం గురించి తెలుసా?

ప్రపంచప్రఖ్యాత HYD సంస్థానాన్ని 16 జిల్లాలుగా విభజించారు. తెలంగాణ 8, మరాఠ 5, కన్నడ 3 జిల్లాలుగా విస్తరించారు. అనేక రాజవంశాల పాలనలో సుసంపన్నమైన ఈ సంస్థానాన్ని 1724లో మీర్ కమర్-ఉద్-దిన్ ఖాన్ సిద్దిఖీ అసఫ్జాహీ వంశాన్ని స్థాపించి 224 ఏళ్లు పరిపాలించారు. కాలక్రమంలో వీరి అరాచకాలు ఢిల్లీకి చేరాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ బలగాలతో ఇక్కడికి వచ్చి సంస్థానాన్ని భారతమాత ఒడిలో విలీనం చేశారు.
News October 31, 2025
జూబ్లీహిల్స్: రోజుకు 2 డివిజన్లలో సీఎం ప్రచారం

సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. రోజుకు 2 డివిజన్ల చొప్పున 3 విడతలుగా ప్రచారం సాగనుంది. PJR సర్కిల్ నుంచి జవహర్నగర్ మీదుగా సాయిబాబా టెంపుల్ (చాకలి ఐలమ్మ విగ్రహం) వరకు రోడ్ షో.సాయిబాబా టెంపుల్ ఆవరణలో కార్నర్ మీటింగ్లో ప్రసంగం, సోమాజిగూడ డివిజన్లోని ఎల్లారెడ్డిగూడ మార్కెట్ ఏరియా వద్ద మరో కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు.


