News April 11, 2025
HYD: ప్రభుత్వానికి 3D మంత్ర: KTR

కాంగ్రెస్ ప్రభుత్వం 3D మంత్ర అమలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. డిస్ట్రక్షన్, డిమాల్షన్, డైవర్షన్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని, 400 ఎకరాలు అటవీ భూమే అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఆ 400 ఎకరాలు అటవీ భూమి అని చెబుతున్నానన్నారు.
Similar News
News November 9, 2025
ఆదిలాబాద్: రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

ఆదిలాబాద్లోని ఐపీ స్టేడియంలో సోమవారం అస్మిత అథ్లెటిక్స్ లీగ్ (2025-26) జిల్లాస్థాయి ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజా రెడ్డి తెలిపారు. అండర్ 14, 16 విభాగాల్లో బాలికలకు ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 94921 36510 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
News November 9, 2025
జూబ్లీ‘హిట్’ అయ్యేదెవరో?

హాట్ సీటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తుది దశకు చేరింది. హోరాహోరీగా సాగిన ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. దివంగత MLA మాగంటి గోపీనాథ్ భార్యకే టికెట్ ఇచ్చిన BRS సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న INC నవీన్ యాదవ్ గెలుపునకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అటు జూబ్లీహిల్స్లో కాషాయ జెండా ఎగురవేస్తామని BJP చెబుతోంది. మీ కామెంట్?
News November 9, 2025
వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు ఇలా..!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ కేజీ రూ.190 నుంచి రూ.210 మధ్య ధర పలుకుతోంది. స్కిన్ లెస్ కేజీ రూ.220-240 కాగా.. లైవ్ కోడి కేజీ రూ.140-160 మధ్య ఉంది. ట్రై సిటీతో పోలిస్తే పల్లెల్లో ధర రూ.10 వ్యత్యాసం ఉంది. గతవారంతో పోలిస్తే ధరలు స్వల్పంగా తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు.


