News August 24, 2024

HYD: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి అంతంతే..!

image

HYD ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి ప్రైవేట్ ఆసుపత్రులతో పోలిస్తే అంతంత మాత్రమే జరుగుతుంది. 2013నుంచి ఇప్పటివరకు సుమారు నిమ్స్ ఆసుపత్రిలో 32, గాంధీలో ఒకటి, ఉస్మానియాలో 9 అవయవ మార్పిడి పరీక్షలు జరిగాయి. అదే.. యశోదలో 486, కిమ్స్‌లో 275 అవయవ మార్పిడిలు జరగడం గమనార్హం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిపుణులు ఉన్నప్పటికీ, అత్యాధునిక థియేటర్లు, పూర్తి వసతులు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

Similar News

News September 27, 2024

HYD: బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందరూ కోల్..!

image

తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ బొడ్డెమ్మ.. బతుకమ్మ పండుగకు ముందు 9, 5, 3 రోజులు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ సంప్రదాయం పాటించే కన్నెపిల్లలు, బాలికలు మట్టితో చేసిన బొడ్డెమ్మలను పెట్టి, పూలతో అలంకరించి చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్‌.. బిడ్డాలెందరూ కోల్‌’ అంటూ కోలాటం ఆడతారు. మరి మీ ప్రాంతంలో బొడ్డెమ్మ పండుగ చేస్తే Way2Newsకు ఫొటోలతో వార్త పంపండి.

News September 27, 2024

HYD: బాపూజీ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక: సీపీ

image

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బాపూజీ అని పేర్కొన్నారు. ఆయన కృషికి గుర్తుగా ఇటీవల ప్రభుత్వం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి వారి పేరు పెట్టినట్లు గుర్తు చేసుకున్నారు.

News September 27, 2024

HYD: ఈడీతో భయపెట్టాలని చూస్తే నడవదు: మహేశ్‌గౌడ్

image

బీజేపీ, బీఆర్ఎస్ సలహాల మేరకే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై ఈడీ రైడ్స్ చేశారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు చేసిందని, ఈడీతో భయపెట్టాలని చూస్తే తమ వద్ద నడవదన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక నాయకులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.