News November 8, 2024
HYD: ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ ఎక్కడ?

HYD, RR, మేడ్చల్ జిల్లాల్లో 3,70,357 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు. అయితే పాఠశాలలపై అనునిత్యం జరగాల్సిన తనిఖీలు జరగడం లేదు. అధికారులకు నెలనెలా తనిఖీలు చేసి పరిస్థితి ఎలా ఉంది..? విద్యార్థులకు అన్ని వసతులు ఉన్నాయా..? పాఠశాలకు, పిల్లలకు ఏం అవసరం..? అనే వివరాలు రికార్డు చేయాల్సి ఉంది. కానీ.. అది జరగడం లేదంటున్నారు. దీంతో పలుచోట్ల పిల్లలే రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నారు.
Similar News
News November 12, 2025
FLASH: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈరోజు అధికారులు డ్రగ్స్ పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుడు సలీంను (DRI) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అతడి బ్యాగులో 4.3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, సలీంను అదుపులోకి తీసుకున్న అధికారులు, నిషేధిత వస్తువులను సీజ్ చేశారు.
News November 11, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: MLAలు, మాజీ MLAలపై కేసు నమోదు

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ సిటీ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. మధురానగర్ PSలో ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, రాందాస్పై రెండు కేసులు ఫైల్ అయ్యాయి. బోరబండ PSలో మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్పై ఓ కేసు నమోదైంది. కోడ్ ఉల్లంఘనపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజాస్వామ్యంగా ఎన్నికలు సాగాలంటే ప్రతి ఒక్కరూ నియమాలను గౌరవించాలని సిటీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
News November 11, 2025
ప్రజావాణికి 29 ఫిర్యాదులు: రంగారెడ్డి కలెక్టర్

రంగారెడ్డి జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత శ్రద్ధ కనబరచాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి 29 ఫిర్యాదులు అందాయన్నారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.


